News November 19, 2025

NLG: మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా

image

నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పాతపల్లెకు చెందిన 12 సంఘాల పేరున ఆ గ్రామానికి చెందిన బుక్ కీపర్ ఒకరు బ్యాంకు ఫీల్డ్ అధికారులతో కలిసి కుమ్మక్కై కోటిన్నర రుణాలు తీసుకున్నారు. 4నెలల నుంచి చెల్లింపులు ఆగడంతో బ్యాంకు సిబ్బంది బాధితుల దగ్గరికి వెళ్లగా తమకేం తెలియదని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. బుక్ కీపర్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు మంగళవారం బ్యాంకు ముందు నిరసన తెలిపారు.

Similar News

News March 29, 2026

ఏపీకి తొలి పతకం అందించిన బాపట్ల అబ్బాయి

image

చండీగఢ్‌లో నిర్వహించిన ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్–2026 వెయిట్‌లిఫ్టింగ్ పోటీలలో ఏపీకి తొలి పతకం దక్కింది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన దేవరకొండ ప్రేమ్ సాగర్ 88 కేజీల విభాగంలో 270 కేజీలు ఎత్తి రజత పతకం సాధించాడు. మార్చి 26 నుంచి జరుగుతున్న ఈ పోటీల్లో ప్రేమ్ సాగర్ ప్రతిభతో రాష్ట్రానికి గౌరవం తెచ్చాడు. ఆయన విజయంపై పలువురు క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు.

News March 29, 2026

‘బైకర్’ కోసం శర్వానంద్ 23 కేజీలు తగ్గారు: డైరెక్టర్

image

‘బైకర్’ సినిమా కోసం శర్వానంద్ 6 నెలలు బ్రేక్ తీసుకొని ఫిజికల్‌గా, మెంటల్‌గా ప్రిపేర్ అయ్యారని డైరెక్టర్ అభిలాష్ వెల్లడించారు. ప్రొఫెషనల్ బైకర్‌లా కనిపించడానికి 23KGల బరువు తగ్గారని తెలిపారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో షూటింగ్‌ చేస్తున్నప్పుడు అనేక ప్రమాదాలు జరిగాయని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. తండ్రిగా, కోచ్‌గా రాజశేఖర్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది.

News March 29, 2026

పాలమూరు: 20రోజుల క్రితమే పెళ్లి.. యువతి మిస్సింగ్!

image

నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటకు చెందిన యువకుడి(26)తో HYD ఇస్మాయిల్‌ఖాన్‌ గూడకు చెందిన యువతి(19)కి ఈనెల 8న వివాహం జరిగింది. ఉగాది సందర్భంగా పుట్టింటికి వచ్చిన ఆమె, డిగ్రీ పరీక్ష రాయడానికి ఈనెల 24న ఇంటి నుంచి బయలుదేరి వెళ్లి తిరిగి రాలేదు. పోచారం ఐటీ కారిడార్ PS పరిధిలో అదృశ్యమైంది. ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.