News November 19, 2025
NLG: మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా

నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పాతపల్లెకు చెందిన 12 సంఘాల పేరున ఆ గ్రామానికి చెందిన బుక్ కీపర్ ఒకరు బ్యాంకు ఫీల్డ్ అధికారులతో కలిసి కుమ్మక్కై కోటిన్నర రుణాలు తీసుకున్నారు. 4నెలల నుంచి చెల్లింపులు ఆగడంతో బ్యాంకు సిబ్బంది బాధితుల దగ్గరికి వెళ్లగా తమకేం తెలియదని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. బుక్ కీపర్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు మంగళవారం బ్యాంకు ముందు నిరసన తెలిపారు.
Similar News
News March 12, 2026
ఉమ్మడి గుంటూరులో ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయంటే..?

ఉమ్మడి గుంటూరు మొత్తం 3,85,159 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దీపం కనెక్షన్లు 1,83,176, గిరిజన కనెక్షన్లు 8,324, వాణిజ్య కనెక్షన్లు 16,859, ఉజ్వల పథకం కింద 25,190, సాధారణ కనెక్షన్లు 1,51,610 ఉన్నాయి. పల్నాడు జిల్లాలో మొత్తం 3,80,403 కనెక్షన్లు ఉండగా, దీపం 1,50,315, గిరిజన 326, వాణిజ్య 7,334, ఉజ్వల 75,333, సాధారణ 1,47,095 కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 50% అధిక బుకింగ్‌లు మొదలయ్యాయి.
News March 12, 2026
గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు: జేసీ

గృహావసర ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా ఆగుతుందనే సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. అవసరం లేకుండా రీఫిల్ బుకింగ్ చేయవద్దన్నారు. గుంటూరులో తనిఖీల్లో వ్యాపార సంస్థల్లో వాడుతున్న 66 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 14 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
News March 12, 2026
కట్టెల పొయ్యిలే దిక్కవుతున్నాయి..

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు సంక్షోభంలో పడ్డాయి. తమ వద్ద స్టాక్ లేదని, బుక్ చేసినా రావడం లేదని యజమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇప్పటికే పలు హోటళ్లు మూతపడగా కొందరు కట్టెల పొయ్యి వాడుతున్నారు. చెన్నైలో ఓ హోటల్ యజమాని బట్టీ కట్టించుకుని పెద్ద మొత్తంలో కట్టెలు తెప్పించుకున్నారు. అటు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో ఇప్పటికే కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు.


