News November 19, 2025

వరంగల్: పాక్స్‌లు ఎలా బలోపేతం అవుతున్నాయో తెలుసా..?

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మల్టీ సర్వీసు సెంటర్(MSC) స్కీమ్ ద్వారా DCC బ్యాంక్ పీఏసీఎస్‌లకు కేవలం 1% వడ్డీకే రుణాలు అందిస్తోంది. గతంలో పంట రుణాలకే పరిమితమైన PACSలు ఇప్పుడు ఈ రుణాలను పెట్టుబడులుగా మల్చుకుని సొంత ఆస్తుల నిర్మాణం, కొత్త ఆదాయ వనరుల సృష్టిలో ముందంజలో ఉన్నాయి. అద్దె భవనాల నుంచి స్వంత భవనాల్లో సేవలు అందిస్తూ ఆర్థికంగా బలపడుతున్నాయి. అందుకే మన ఛైర్మన్ రాష్ట్రానికే ప్రాతినిధ్యం వస్తున్నారు.

Similar News

News March 5, 2026

GALLERY: ‘విరోష్’ రిసెప్షన్.. తళుక్కుమన్న తారలు

image

విజయ్ దేవరకొండ-రష్మిక రిసెప్షన్‌లో సినీ తారలు సందడి చేశారు. నానీ, వెంకటేశ్, నాగార్జున, నాగచైతన్య, అల్లుఅర్జున్, కార్తీ, నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, సత్యదేవ్ తదితరులు నూతన వధూవరులకు గ్రీటింగ్స్ చెప్పారు. ఇక రాజకీయ ప్రముఖుల్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విరోష్ జంటకు శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించారు.

News March 5, 2026

PDPL: జిల్లా వ్యాప్తంగా ‘సైబర్ జాగృతి దివాస్’

image

‘సైబర్ జాగృతి దివాస్’ సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ‘సైబర్ మోసాలకు చెక్- అప్రమత్తతే రక్షణ’ పై ప్రజలకు అవగాహన కల్పించారు. సెల్ ఫోన్ లకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరికి తెలియపరచవద్దని, ఆన్ లైన్ ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రధానంగా బ్యాంకు సంబంధించిన వివరాలు ఎవరికీ ఇవ్వవద్దన్నారు. సైబర్ నేరాలకు గురైన వెంటనే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేసి పోలీస్ సహాయం పొందాలన్నారు.

News March 5, 2026

నేషనల్ సేఫ్టీ వీక్.. జగిత్యాల డిపోలో అవగాహన

image

నేషనల్ సేఫ్టీ వీక్ సందర్భంగా బుధవారం జగిత్యాల ఆర్టీసీ డిపో ఆవరణలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాలు సంభవించిన సమయంలో ఫైర్ ఎక్విప్‌మెంట్‌ను ఎలా ఉపయోగించాలి, అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలి అనే అంశాలపై డిపో ఉద్యోగులకు ప్రదర్శనతో మెలకువలు నేర్పించారు. అగ్నిమాపక శాఖ ఎల్‌పీఎఫ్ ఫిట్టర్ జి.మధు టీమ్ లీడర్‌గా పాల్గొన్నారు. డిపో మేనేజర్ కె.కల్పన తదితరులు ఉన్నారు.