News November 19, 2025

ఉమ్మడి కరీంనగర్‌లో BCలకు 268 GPలే..!

image

50% రిజర్వేషన్లు మించకూడదన్న నిబంధనతో బీసీలకు 22 శాతం రిజర్వేషన్ల క్యాప్‌తో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,216 గ్రామపంచాయతీల(GP)లో 22% రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు మొత్తంగా 268 స్థానాలు మాత్రమే దక్కనున్నాయి. ఇక రిజర్వేషన్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సర్కార్ ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News March 22, 2026

హనుమకొండలో ఎక్కువ.. వరంగల్‌లో తక్కువ!

image

ఉమ్మడి వరంగల్‌‌లో క్షయ వ్యాధి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈనెల 24న ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. హన్మకొండ జిల్లాలో ఈఏడాది 890 కొత్త కేసులు నమోదయ్యాయి. వరంగల్‌‌లో 289 కేసులు మాత్రమే వెలుగు చూశాయి. వరంగల్‌ టీబీ సెంటర్‌లో వైద్యుల కొరత కారణంగానే కేసుల నమోదు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

News March 22, 2026

‘ASFలో నియంత్రణ లేని బోర్లు.. నీటి సంక్షోభం భయం’

image

ఆసిఫాబాద్ జిల్లాలో బోర్‌వెల్ త్రవ్వకాలు నియంత్రణ లేకుండా కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు తీసుకోకుండానే విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారని సమాచారం. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ త్రవ్వకాలు జరగడంతో భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు.

News March 22, 2026

అరకు వ్యాలీ మ్యూజియంలో పర్యాటకుల రద్దీ

image

అరకు ట్రైబల్ మ్యూజియంలో ఆదివారం రోజు భారీగా సందర్శకులు తరలివచ్చారు. వీకెండ్స్ కావడంతో పర్యాటకులు అధికంగా చేరుకొని, మ్యూజియం పరిసరాల్లో రద్దీగా మారాయి. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను చూసేందుకు సందర్శకులు ఆసక్తి చుపించారు. అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల నుంచి వీక్షకులు రావడంతో మ్యూజియంలో సందడి వాతావరణం నెలకొంది.