News November 19, 2025

పిల్లల్లో జలుబు తగ్గించే చిట్కాలు ఇవే

image

* పిల్లలను హైడ్రేట్ చేయడానికి గోరు వెచ్చని నీరు, సూప్స్, కొబ్బరి నీళ్లు ఇవ్వండి. దీనివల్ల వారి శరీరం ఎనర్జిటిక్‌గా ఉంటుంది. * తల కాస్త ఎత్తులో పెట్టుకుని పడుకునేలా చేయండి. * సెలైన్ నాజిల్ డ్రాప్స్ వాడండి. ఏడాది లోపు పిల్లల ముక్కులో నాలుగైదు గంటలకోసారి 2 డ్రాప్స్, అంతకంటే పెద్ద పిల్లల్లో 3-4 డ్రాప్స్ వేయండి. * విటమిన్-C ఉండే జామ, కివీ, ఆరెంజ్ పండ్లు ఇవ్వండి. దీనివల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.

Similar News

News March 12, 2026

గతం ఘనం.. AUలో పరిశోధకులకు కష్టకాలం

image

AUలో PHD చేస్తున్న పరిశోధక విద్యార్థులు తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. సరైన స్టైఫండ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. UGC మార్గదర్శకాల ప్రకారం అనేక జాతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రతినెలా స్టైఫండ్ అందుతోంది. కేరళ, తమిళనాడులో నెలకు రూ.15 వేల వరకు ఇస్తున్నారు. అయితే AUలో మాత్రం తగిన మద్దతు లేకపోవడంతో పరిశోధనపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నామని విద్యార్థులు చెబుతున్నారు.

News March 12, 2026

భారత్‌పై మళ్లీ టారిఫ్స్‌.. రెడీ అవుతున్న ట్రంప్?

image

అమెరికాపై అధిక టారిఫ్‌లు వేస్తున్నాయనే ఆరోపణలతో భారత్, చైనా సహా 16 దేశాలపై దర్యాప్తునకు ట్రంప్ ఆదేశించారు. గతంలో వివిధ దేశాలపై విధించిన అదనపు టారిఫ్‌లను అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ విచారణ ఆయా దేశాలు అమెరికా విషయంలో అన్యాయమైన ట్రేడ్ ప్రాక్టీసెస్‌ను అమలు చేస్తున్నాయని నిర్ధారిస్తే మళ్లీ టారిఫ్స్ వేయడం లేదా ఇతర ప్రతీకార చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.

News March 12, 2026

ఉగాది రోజు ఇలా చేయకండి: పండితులు

image

ఉగాది రోజున తప్పక పాటించాల్సిన నియమాలను పండితులు సూచిస్తున్నారు. ‘ఈ పర్వదినాన మాంసం ముట్టకూడదు. శాకాహారమే భుజించాలి. ఎవరిపై కోప్పడొద్దు. కన్నీరు పెట్టుకోకూడదు. ఈరోజుతో ఏడాది మొదలు కాబట్టి నవ్వుతూ ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉంచాలి. లేకుంటే దరిద్రం. అలాగే ఆరోజు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తాగకుండా అస్సలు ఉండొద్దు’ అని చెబుతున్నారు.