News November 19, 2025
ఆన్‌లైన్‌లో అమ్మాయిలపై వేధింపుల్లో HYD ఫస్ట్!

నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆన్‌లైన్‌లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపుల్లో దేశంలోనే HYD నం.1గా నిలిచింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో ఎక్కువగా నమోదయ్యాయి. ఆన్‌లైన్‌లో అసభ్య మెసేజ్‌లు పంపడం, మార్ఫింగ్ ఫొటోలు పంపించడం, అమ్మాయికి నచ్చకపోయినా వరుసగా మెసేజ్‌లు పంపుతూ ఇబ్బంది పెట్టడం వంటి వేధింపులు ప్రధానంగా కనిపిస్తున్నాయని నివేదికలో వెల్లడైంది.
Similar News
News March 18, 2026
తాడూరులో 33.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

జిల్లాలోని పలుచోట్ల మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అకాల వర్షం కురిసింది. మధ్యరాత్రి రెండు గంటల తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోనే అత్యధికంగా తాడూరు మండలంలో 33.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. కోడేరులో 24.8, కల్వకుర్తిలో 18.8, బిజినేపల్లిలో 22.8, ఊర్కొండలో 18.3, నాగర్ కర్నూల్‌లో 18.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News March 18, 2026
అమ్రాబాద్: రాత్రివేళల్లో ‘నైట్‌జార్’ పక్షి వింత శబ్దాలు

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో రాత్రిపూట చురుకుగా ఉండే ‘నైట్‌జార్’ పక్షి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చెట్టు బెరడు రంగులో ఉండటం వల్ల పగలు దీనిని గుర్తించడం కష్టం. రాత్రి వేళల్లో ఇది చేసే వింత శబ్దాలను చూసి స్థానికులు వేరే జంతువులుగా భ్రమపడుతుంటారని అధికారులు తెలిపారు. పురుగులను ఆహారంగా తీసుకునే ఈ పక్షి అడవిలో ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది.
News March 18, 2026
రేపు మచిలీపట్నంలో జిల్లా స్థాయి ఉగాది వేడుకలు

తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను ఈ నెల 19వ తేదీన మచిలీపట్నంలోని బచ్చుపేట వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారన్నారు. ఈ వేడుకలకు ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ తోపాటు మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర ప్రజాప్రతినిథులు పాల్గొంటారన్నారు.


