News November 19, 2025

ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి: KMR SP

image

కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిసెప్షన్, లాక్-అప్ రూమ్ సహా అన్ని విభాగాలను పరిశీలించారు. సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, మూఢనమ్మకాలు వంటి అంశాలపై గ్రామాల్లో అవగాహన పెంచాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఎస్పీ సూచించారు. ASP చైతన్య రెడ్డి, CI రామన్, SHO రంజిత్ పాల్గొన్నారు.

Similar News

News March 18, 2026

WGL: ‘కొత్త సర్వీసుల మంజూరుకు నూతన విధానం అమలు’

image

కొత్త సర్వీసుల కొరకు సర్వీస్ లైన్ ఛార్జీల (SLC) నూతన విధానాన్ని అమలులోకి తెచ్చామని ఎన్పీడీసీఎల్ వరంగల్ ఎస్ఈ K.గౌతంరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి జారీ చేసిన రెగ్యులేషన్ నం.1 ఆఫ్ 2026 మేరకు మార్పులు జరిగాయన్నారు. వినియోగదారులకు మరింత సులభతరంగా పారదర్శకత కలిగించే విధంగా విద్యుత్ సేవలు అమల్లోకి వస్తాయన్నారు.

News March 18, 2026

NTR: LL.B 6వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) పరిధిలోని కాలేజీలలో మూడేళ్ల LL.B. కోర్సు చేసే విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఏప్రిల్ 13 నుంచి నిర్వహిస్తామని.. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 25లోపు, రూ. 100 ఫైన్‌తో 26 లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.

News March 18, 2026

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: తీన్మార్ మల్లన్న

image

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. అయితే సంస్థ మనుగడతో పాటు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించకూడదని ఆయన సూచించారు. ప్రధానంగా కార్మికులకు పెండింగ్‌లో ఉన్న రెండు పీఆర్సీ (PRC) బకాయిలను వెంటనే చెల్లించాలని, వారి ఉద్యోగ భద్రతకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.