News November 19, 2025

NLG: మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా

image

నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పాతపల్లెకు చెందిన 12 సంఘాల పేరున ఆ గ్రామానికి చెందిన బుక్ కీపర్ ఒకరు బ్యాంకు ఫీల్డ్ అధికారులతో కలిసి కుమ్మక్కై కోటిన్నర రుణాలు తీసుకున్నారు. 4నెలల నుంచి చెల్లింపులు ఆగడంతో బ్యాంకు సిబ్బంది బాధితుల దగ్గరికి వెళ్లగా తమకేం తెలియదని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. బుక్ కీపర్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు మంగళవారం బ్యాంకు ముందు నిరసన తెలిపారు.

Similar News

News March 27, 2026

విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ప్రమాదం.. దంపతుల దుర్మరణం

image

విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. మంగళగిరి (M) చినకాకాని వద్ద వేగంగా వస్తున్న ఆటో, బైక్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న మంగళగిరికి చెందిన దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

News March 27, 2026

లగ్జరీ ఫ్లాట్ కొన్న గిల్.. బిల్డర్ హీరోయిన్ భర్తే!

image

దేశంలోనే రిచెస్ట్ పర్సన్స్ నివసించే ముంబై జుహూలో టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఏకంగా రూ.20.7 కోట్లు పెట్టి ఓ అపార్ట్‌మెంట్ 12వ ఫ్లోర్‌లో 3,369 చ.అ. ఫ్లాట్ కొన్నారు. స్టాంప్ డ్యూటీకే 1.24Cr చెల్లించారు. ఇక ఈ అపార్ట్‌మెంట్‌ను ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో కలిసి రకుల్‌ప్రీత్ భర్త జాకీ భగ్నానీ, ఆయన పేరెంట్స్ నిర్మిస్తుండటం గమనార్హం. దీని నిర్మాణం 2029లో పూర్తి కానుంది.

News March 27, 2026

భద్రాద్రి: సీఎంకు ఐదు విలీన గ్రామాలపై విజ్ఞప్తి

image

సారపాక ఐటీసీ అతిథి గృహంలో సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ పొదెం వీరయ్య, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావు, ఎంపీ బలరాం నాయక్.. ఏపీలో ఉన్న 5 విలీన గ్రామాలను తిరిగి తెలంగాణలో చేర్చాలని, భద్రాచలం–వాజేడు ప్రధాన రహదారిని పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.