News November 18, 2025
సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారు: కవిత

సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ MP కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె జాగృతి జనం బాటలో భాగంగా మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్లు పనిచేసిన తనను కుట్ర చేసి పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం చేశారని అన్నారు. తనపై ఇంకా నీచస్థాయిలో దాడులు చేస్తున్నారని, అయినా సరే ఎవ్వరికీ బెదిరేదే లేదని కవిత స్పష్టం చేశారు.
Similar News
News November 18, 2025
వారికి నోటీసులు అందించండి: MHBD ZP CEO

ఇల్లు మంజూరైనా ఇప్పటిద వరకు నిర్మాణం మొదలుపెట్టని వారికి నోటీసులు జారీ చేసి, పనులు మొదలు పెట్టేలా చూడాలని అధికారులకు ZP CEO పురుషోత్తం సూచించారు. మరిపెడ మండలం MPDO వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. మండలంలో 104 ఇందిరమ్మ ఇండ్లు ఇంకా మొదలు పెట్టలేదని, మంజూరైన ఇండ్ల లబ్ధిదారులతో అధికారులు మాట్లాడాలని చెప్పారు. ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించి వారికి నోటీసులు అందజేయాన్నారు.

పెద్దపల్లి: అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్

RGM కార్పొరేషన్ పనితీరుపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించారు. నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. TUIDF నిధులను సకాలంలో, నాణ్యతతో వినియోగించాలని సూచించారు. ఆదాయ వనరులను పెంచడంపై దృష్టి సారించి, ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ వసూళ్లను 100 శాతం పూర్తి చేయాలన్నారు. పారిశుధ్యాన్ని పటిష్టం చేసి, రోడ్లపై చెత్త లేకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.