News November 18, 2025
కుటుంబ, వారసత్వ రాజకీయాలతో దేశానికి ముప్పు: బండి సంజయ్

కుటుంబ, వారసత్వ రాజకీయాలతో దేశానికి పెనుముప్పు పొంచి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సర్దార్ @ 150 యూనిటీ మార్చ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. MLC అంజిరెడ్డి, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ పాల్గొన్నారు.
Similar News
News November 18, 2025
అల్లూరి: ‘భూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి’

రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాడేరు కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్నదాత సుఖీభవ, ఆర్వోఎఫ్ఆర్, మ్యుటేషన్‌కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ పోర్టల్ నందు ఆధార్ నంబర్లను సరిచేసి వెంటనే అనుమతి కోసం మండల వ్యవసాయ అధికారుల లాగిన్‌కు పంపించాలన్నారు.
News November 18, 2025
విండ్రో కంపోస్టింగ్ యూనిట్‌ను పరిశీలించిన కమిషనర్, మేయర్

వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్‌పేయి, మేయర్ గుండు సుధారాణితో కలిసి మంగళవారం బాలసముద్రంలోని విండ్రో కంపోస్టింగ్ యూనిట్‌ను సందర్శించారు. హాస్టళ్లు, హోటళ్లు, మార్కెట్ల నుంచి సేకరించిన ఆహార వ్యర్థాలతో కంపోస్ట్ తయారీకి జరుగుతున్న ట్రయల్ రన్‌ను వారు సమగ్రంగా పరిశీలించారు. పనులు మరింత వేగవంతంగా జరిగేలా సంబంధిత సిబ్బందికి సూచనలు జారీ చేశారు.
News November 18, 2025
చలికి చర్మం పగులుతుందా?

చలి పెరగడంతో శరీరం పగిలి ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేసిన వెంటనే & పడుకునే ముందు మందపాటి, ఆయిల్ ఆధారిత మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాయండి. చలికాలంలో కూడా రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగితే చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్‌గా ఉంచవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి’ అని తెలిపారు.


