News November 19, 2025
జీపీ ఎన్నికలు.. ఉమ్మడి పాలమూరులో బీసీ స్థానాలపై ఆసక్తి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం తర్వాత, ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించగా, ఉమ్మడి పాలమూరులో 704 జీపీలలో బీసీలు సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం ఉంది. డిసెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో ఆశావహులు తమ సన్నాహాలను మొదలుపెట్టారు.
Similar News
News March 25, 2026
ప.గో: పసిపిల్ల విక్రయాలు.. ‘నిందితులు మంచి మనసున్న వారట'(1/2)

పసిపిల్లల విక్రయాల కేసు అనేది ప్రస్తుతం ఉమ్మడి ప.గోలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కైకలూరులో మొన్న అదుపులోకి తీసుకున్న నిందితుల రిమాండ్ రిపోర్టులో పసిపిల్లల విక్రయాలను మంచి మనసుతో, సహృద్భావంతోనే చేశారంటూ పోలీసులు నిందితులకు అనుకూలంగా రాశారు. దీన్ని చూస్తుంటే నిందితులకు పోలీసులు ఏ విధంగా వంతపాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సంతానం లేని వారికి పిల్లలను విక్రయించడం సహృద్భావమే అయినప్పటికీ…
News March 25, 2026
విచారణ అధికారిగా నేను చేయను!(2/2)

దత్తత అనేది కలెక్టర్ సమక్షంలో అధికారికంగా జరుగుతుంది. కానీ.. నిబంధనలు ఏమీ పాటించకుండా విక్రయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుంటే సాయంత్రానికి బెయిల్ ద్వారా బయటకు వచ్చేసే పరిస్థితి. రాజకీయ, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిళ్ల నేపథ్యంలో ఒక పోలీసు అధికారి తాను విచారణాధికారిగా విధులు నిర్వహించలేనని ఈ కేసు నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో అధికారి విచారణాధికారిగా ఉన్నారు.
News March 25, 2026
GNT: చంద్రబాబుకు స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ, కమిషనర్

సీఎం చంద్రబాబును కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, జీఎంసీ కమిషనర్ మయూర్ మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు నగరంలో జరిగిన ఎమ్మెల్యే ధూళ్ళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి బుధవారం చంద్రబాబు విచ్చేశారు. ఈ క్రమంలో కలెక్టర్, ఎస్పీ, కమిషనర్ పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.


