News November 19, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ధరలిలా

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,116, కనిష్ఠ ధర రూ.1,827, వరి ధాన్యం(1010) గరిష్ఠ ధర రూ.2,121, కనిష్ఠ ధర రూ.1,900, వరి ధాన్యం(HMT) గరిష్ఠ ధర రూ.2,200, కనిష్ఠ ధర రూ.2,150, వరి ధాన్యం(JSR) గరిష్ఠ ధర రూ.2,891, కనిష్ఠ ధర రూ.2,081గా పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు.
Similar News
News March 18, 2026
కామారెడ్డి: హత్యాయత్నం కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు

కులం పేరుతో దూషించి, హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడు షేక్ దావూద్‌కు కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష, ₹5,000 జరిమానా విధించింది. కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసులో దర్యాప్తు చేసి శిక్ష పడేలా చేసిన పోలీసులను ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. నేరం చేస్తే చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు.
News March 18, 2026
అల్లూరి: ‘గ్రామస్థాయిలో ప్రత్యేక సదస్సులు నిర్వహించాలి’

గ్రామస్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం పాడేరు కలెక్టర్ క్యాంపు ఆఫీస్ నుండి పోలవరం, అల్లూరి జిల్లాల అధికారులతో వీసీ నిర్వహించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయిలో ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని సూచించారు.
News March 18, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


