News November 19, 2025
కారంపూడి: రాచగావు అంటే ఏమిటో తెలుసా..?

కారంపూడిలో నేటి నుంచి పల్నాడు వీరుల ఉత్సవాలు రాచగావుతో ప్రారంభం అవుతున్నాయి. రాచగావు అంటే ఏమిటో తెలుసా..? రాచగావు అనేది వీరుల గుడి పూజారులు పోతురాజు ఆచారవంతునితో కలిసి పోతురాజుకు గావు (రక్షణతో కూడిన చూపు లేదా సేవ) చేస్తూ, ఉత్సవాలకు ప్రారంభం చేస్తారు. ఈ కార్యక్రమం పాటలు, వీర నృత్యాలతో జరుగుతుంది ఉత్సవాలలో వీరుల ఆరాధన, వారి ధైర్య గాథలకు భక్తి తెలియజేసే ముఖ్యమైన పురాణ సాంప్రదాయంగా ఉంది.
Similar News
News March 10, 2026
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌పై ట్రంప్ రియాక్షన్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ ఎన్నికవడంపై తాను అసంతృప్తిగా ఉన్నట్లు ట్రంప్ అన్నారు. ఆయన సెలక్షన్ వల్ల ఇరాన్ మళ్లీ అదే సమస్య ఎదుర్కొనే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. పరోక్షంగా అయతుల్లా అలీ ఖమేనీ తరహాలోనే మొజ్తబాను హత్య చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. కొత్త లీడర్‌గా ఎవరొచ్చినా ఎక్కువ కాలం ఉండబోరని.. వారినీ అంతం చేస్తామని అమెరికా గతంలో హెచ్చరించిన విషయం తెలిసిందే.
News March 10, 2026
ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి.. డ్రోన్లతో నిఘా

ఖమ్మం మిర్చి మార్కెట్‌కు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. సోమవారం తేజ రకం మిర్చికి గరిష్ఠ ధర రూ. 19,225, మోడల్ ధర రూ. 18,000 నమోదైంది. సూర్యాపేట, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చిన నిల్వలతో యార్డు నిండిపోయింది. కాంటా పనులు, క్రయవిక్రయాల్లో అక్రమాలు జరగకుండా అధికారులు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షించడం విశేషం. రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు నిఘా ఏర్పాటు చేశారు.
News March 10, 2026
HYD: PF సమస్యలు ఉన్నాయా? ఇక్కడికి రండి

EPFOకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు బాలానగర్ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో ఉన్న EPFO కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు. PF విత్‌డ్రా, నామినీ యాడ్ చేయడం, KYC అప్‌డేట్, అకౌంట్ సంబంధిత ఇతర సమస్యలను అక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.


