News November 19, 2025

HYD: కేంద్రమంత్రికి చనగాని దయాకర్ బహిరంగ లేఖ

image

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఐఐఎంలు, ఐఐటీలు, పెట్రోలియం సంస్థలతోపాటు ఇతర కేంద్రీయ విద్యా సంస్థలను తక్షణమే మంజూరు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. డిసెంబర్‌లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో జాతీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కేంద్ర అనుమతిని మంజూరు చేయించాలని అభ్యర్థించారు.

Similar News

News March 20, 2026

రాష్ట్ర బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే?

image

TG: రాష్ట్ర <<19431667>>బడ్జెట్‌<<>>లో వివిధ రంగాలకు కేటాయింపులు..
* వ్యవసాయ శాఖ: రూ.23,179 కోట్లు * పౌర సరఫరాల శాఖ: రూ.7,366 కోట్లు
* పశు సంవర్ధకశాఖ: రూ.1,529 కోట్లు * విద్యుత్ శాఖ: రూ.21,285 కోట్లు
* కార్మిక శాఖ: రూ998 కోట్లు * మాతా, శిశు సంక్షేమ శాఖ: రూ.3,143 కోట్లు
* పర్యాటక రంగం: రూ.1,224 కోట్లు * రైతు భరోసా: రూ.18 వేల కోట్లు
* ఆరోగ్యశాఖ: రూ.13,679 కోట్లు * SC సంక్షేమం: రూ.11,784 కోట్లు

News March 20, 2026

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో వెయ్యి కోట్ల స్కాం: హరీశ్‌రావు

image

ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లలో స్కాంలు కొనసాగుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి స్కాంలు చేస్తున్నాడని అన్నారు. అందులో సీఈ, ఈఎన్‌సీ అందరూ రిటైర్డ్‌ వాళ్లే ఉన్నారని తెలిపారు. నాలుగైదు స్కూళ్లను ప్యాకేజీ చేసి అన్యాయాలకు తెర తీశారని హరీశ్‌రావు మండిపడ్డారు. వీటి టెండర్లలో రూ.1000 కోట్ల స్కాం జరిగిందని అన్నారు.

News March 20, 2026

రూ.3.24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌

image

2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర పద్దును ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ‘రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకెళ్తున్నాం. సంక్షేమం, మహిళాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశానికి తెలంగాణ బలమైన గ్రోత్ ఇంజిన్. ఆక్స్‌ఫర్డ్ స్థాయిలో విద్యనందిస్తున్నాం’ అని తెలిపారు. పూర్తి బడ్జెట్ వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.