News April 13, 2024
విడిపోయేందుకు డివోర్స్ రింగ్స్.. బ్రేకప్ రింగ్స్
ఇద్దరిని ఒక్కటి చేసే ఎంగేజ్మెంట్ రింగ్స్ అంటే మనందరికీ తెలుసు. కానీ మీరెప్పుడైనా విడిపోయే రింగ్స్ గురించి విన్నారా? అమెరికన్ మోడల్ ఎమిలీ రతాజ్‌కోవ్‌స్కిహాస్ ‘డివోర్స్ రింగ్స్’ చూపిస్తూ సోషల్ మీడియాలో విడాకులు ప్రకటించారు. దీంతో ఇవి ట్రెండ్ అవుతున్నాయి. అయితే.. ఇంతకుముందే ఇవి వెస్టర్న్ దేశాల్లో పాపులర్. న్యూయార్క్‌లోని జువెల్లరీ షాపులు 3ఏళ్లుగా డివోర్స్ రింగ్స్, బ్రేకప్ రింగ్స్ తయారు చేస్తున్నాయి
Similar News
News November 16, 2024
కన్నీళ్లు పెట్టుకున్న హీరో.. ఓదార్చిన సీఎం CBN
పితృ వియోగంతో శోకసంద్రంలో మునిగిపోయిన టాలీవుడ్ హీరో నారా రోహిత్‌ను తన పెద్దనాన్న, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. రామ్మూర్తి కుమారులైన గిరీశ్, రోహిత్‌లను హత్తుకుని ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. కాగా, రామ్మూర్తికి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన AIG ఆస్పత్రికి చేరుకుంటున్నారు.
News November 16, 2024
BJP, కాంగ్రెస్‌పై ECI నజర్.. నడ్డా, ఖర్గేకు లేఖలు
ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై ECI చర్యలు తీసుకుంది. వెంటనే వివరణ ఇవ్వాలని BJP చీఫ్ జేపీ నడ్డా, INC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేకు లేఖలు రాసింది. NOV 18వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట లోపు అధికారికంగా స్పందించాలని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల టైమ్‌లోనూ ECI సీరియసైన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఈ రెండు పార్టీలు దూకుడుగా విమర్శలు చేసుకుంటున్నాయి.
News November 16, 2024
ఎన్నికల స్లోగన్.. అదే పార్టీలకు గన్(1/2)
ఓటర్లను ఆకర్షించడానికి, ప్రత్యర్థులను కార్నర్ చేయడానికి పార్టీలు అనుసరించే వ్యూహాల్లో ‘నినాదం’ కీలకం. MH, ఝార్ఖండ్ ఎన్నికల్లో BJP, కాంగ్రెస్ సంధించుకున్న నినాదాలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. అవి: ఏక్ హైతో సేఫ్ హై(ఒక్కటిగా ఉంటే సురక్షితంగా ఉంటాం-మోదీ) *బటేంగే తో కటేంగే(విడిపోతే నష్టపోతాం- UP CM) *భయపడొద్దు- రాహుల్ గాంధీ *భయపడితే చస్తారు- INC *రోటీ-బేటీ-ఔర్ మట్టి (ఝార్ఖండ్ BJP)