News November 18, 2025

వాట్సాప్‌లో ‘మీ-సేవ’.. Hi అని పంపితే చాలు!

image

TG: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ ద్వారా మీ-సేవా సర్వీసులను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందే అవకాశముంది. 80969 58096 నంబర్‌కు Hi అని మెసేజ్ చేసి సేవలు పొందవచ్చు. ఇన్‌కం, బర్త్, క్యాస్ట్, డెత్ సర్టిఫికెట్ల దరఖాస్తుతో పాటు విద్యుత్, నీటి బిల్లులు, ఆస్తి పన్నులు చెల్లించవచ్చు.

Similar News

News November 18, 2025

సెరామిక్ పాత్రలతో ప్రయోజనం..

image

ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఫుడ్డే కాదు వాడే పాత్రలూ ముఖ్యమే. అల్యూమినియం, ఇత్తడి, నాన్ స్టిక్ వల్ల అనారోగ్యం వస్తుందంటున్నారు నిపుణులు. వీటిబదులు సెరామిక్ వాడటం మంచిది. దీంట్లో రసాయనాల కోటింగులు ఉండవు. పుల్లటి పదార్థాలు వండినా రుచి, పరిమళాల్లో మార్పు రాదు. సిలికాన్‌తో రూపొందిన సెరామిక్ జెల్ నాన్‌స్టిక్‌గా పనిచేస్తుంది. ఇవి అత్యధిక ఉష్ణోగ్రతలోనూ సురక్షితంగా ఉంటాయి. శుభ్రపరచడం కూడా చాలా సులువు.

News November 18, 2025

మద్యం తాగుతున్నారా.. డాక్టర్ ఏమన్నారంటే?

image

అతిగా మద్యం సేవిస్తే చిన్న వయసులోనే తీవ్రమైన మెదడు రక్తస్రావం వచ్చే ప్రమాదం ఉందని US అధ్యయనంలో వెల్లడైనట్లు ప్రముఖ వైద్యుడు సుధీర్ హెచ్చరించారు. భారీగా మద్యం సేవించేవారిలో ప్లేట్‌లెట్స్ పనిచేయక రక్తం గడ్డకట్టే సామర్థ్యం దెబ్బతింటుందని వెల్లడించారు. ఫలితంగా పెద్ద రక్తస్రావాలు సంభవిస్తాయని తెలిపారు. మద్యం తాగితే ఏకాగ్రత, నిర్ణయాధికారం దెబ్బతింటాయని, అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడమే మంచిదని సూచించారు.

News November 18, 2025

ఇతిహాసాలు క్విజ్ – 70 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: హనుమంతుడిని ‘మారుతీ’ అని ఎందుకు పిలుస్తారు?
సమాధానం: మారుత్ అంటే సంస్కృతంలో వాయువు అని అర్థం. ఆ వాయు దేవుడి పుత్రుడు కాబట్టే ఆంజనేయ స్వామిని మారుతి అని అంటారు. హనుమంతుడు వాయు శక్తి, వేగాన్ని కలిగి ఉంటాడు. ఆయన ఆకాశంలో పయనించేటప్పుడు, ఆయన వేగం, శక్తి వాయువుతో సమానం. అలా వాయు శక్తిని తనలో నిక్షిప్తం చేసుకున్న దివ్య స్వరూపుడిగా ఆయన్ను మారుతిగా కీర్తిస్తారు. <<-se>>#Ithihasaluquiz<<>>