News November 18, 2025
వనపర్తి: పంచముఖికి ప్రత్యేక డీలక్స్ బస్సు

ఈనెల 20న అమావాస్య సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రం నుంచి పంచముఖికి ప్రత్యేక డీలక్స్ బస్సును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. వనపర్తి నుంచి మధ్యాహ్నం 12గం.కు బయలుదేరి సాయంత్రం పంచముఖి చేరుకొని అక్కడ దర్శన అనంతరం మంత్రాలయం చేరుకొని అక్కడ దర్శనం అనంతరం తిరిగి పంచముఖి చేరుకొని మధ్య రాత్రి బయలుదేరి 21న ఉదయం వనపర్తికి చేరుకుంటుందన్నారు. ఒకరికి రాను పోను రూ.600 ఛార్జీ ఉంటుందన్నారు.
Similar News
News November 18, 2025
బాపట్ల: ‘కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో ఇసుక లభ్యత’

పర్యావరణ అనుమతులు, వాల్టా చట్టం ఆధారంగా ఇసుక రేవులు అనుమతించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం మంగళవారం బాపట్ల కలెక్టరేట్‌లో జరిగింది. కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో ఇసుక లభ్యత ఉందని కలెక్టర్ చెప్పారు. కొల్లూరు మండలం జువ్వలపాలెం ఇసుక రేవులో 14.960 హెక్టార్ల ఇసుక లభ్యత ఉందని స్పష్టం చేశారు. స్థానికుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు.
News November 18, 2025
పార్వతీపురం జిల్లాలో 1,22,260 మంది అర్హులు: కలెక్టర్

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద జిల్లా వ్యాప్తంగా రూ.83.87 కోట్ల నిధులు 1,22,260 మంది రైతుల ఖాతాల్లో బుధవారం జమ కానున్నట్లు కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. పాలకొండ నియోజకవర్గంలో రూ.22.75 కోట్లు, కురుపాం నియోజకవర్గంలో రూ.26.94 కోట్లు, పార్వతీపురం నియోజకవర్గంలో రూ.17.20 కోట్లు, సాలూరు నియోజకవర్గంలో రూ.16.98 కోట్లు మొత్తం రూ.83.87 కోట్ల నిధులు విడుదల కానున్నట్లు తెలిపారు.
News November 18, 2025
సికింద్రాబాద్ MRO ఆఫీసులో ఏసీబీ సోదాలు

సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా సర్వేయర్ కిరణ్ పట్టుబడ్డాడు. ఎమ్మార్వో కార్యాలయంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సర్వేయర్ కిరణ్‌తో పాటు చిన్న మెన్ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


