News April 13, 2024

ఇక నెల రోజులే

image

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల యుద్ధానికి నెల రోజులే సమయం ఉంది. వచ్చే నెల ఇదే రోజున పోలింగ్ జరగనుంది. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 29తో ఉపసంహరణ గడువు ముగియనుంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు. పార్టీల అధినేతలు బస్సు యాత్రలు, సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడచూసినా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

Similar News

News March 14, 2026

మళ్లీ వర్షాలు!

image

ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు కాస్త ఊరట కలగనుంది. ద్రోణి ప్రభావంతో రేపటి నుంచి పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-50KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 18, 19, 20 తేదీల్లో HYD, ఉ.గోదావరి, తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, నెల్లూరు జిల్లాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

News March 14, 2026

‘శల్య సారథ్యం’ అంటే?

image

ఒకరిని నమ్మి కీలక బాధ్యతలు అప్పగిస్తే ప్రత్యర్థికి మేలు చేసేలా వ్యవహరించినప్పుడు ఈ జాతీయం వాడుతుంటారు. భారతంలో పాండవులకు శల్యుడు మేనమామ. అయితే దుర్యోధనుడు కుట్రతో చేసిన సత్కారానికి మెచ్చి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు సాయం చేయడానికి ఒప్పుకుంటారు. తర్వాత నిజం తెలుసుకొని ధర్మరాజు వినతితో కర్ణుడి రథసారథిగా ఉంటూ సూటిపోటి మాటలతో అతని ఏకాగ్రతను దెబ్బతీసి ఓటమికి కారణమవుతారు.
<<-se>>#EPICSAYINGS<<>>

News March 14, 2026

సీఈసీని ఎలా తొలగించవచ్చు?

image

రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం <<19371253>>ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను<<>> తొలగించవచ్చు. ఆర్టికల్ 124(4) ప్రకారం దుష్ప్రవర్తన లేదా అసమర్థత నిరూపితమవ్వాలి. తొలగింపునకు గల కారణాలతో ఓ తీర్మానాన్ని పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. LSలో 100, RSలో 50 మంది సభ్యులు సంతకాలు చేసి స్పీకర్/ఛైర్మన్‌కు సమర్పించాలి. దాన్ని వారు అంగీకరిస్తే ఓటింగ్‌లో 2/3 మెజార్టీ రావాలి. ఆ తర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదించాలి.