News November 19, 2025

నేడు బాపట్ల జిల్లా రైతుల ఖాతాల్లో రూ.107.21కోట్లు జమ!

image

బాపట్ల జిల్లాలోని సుమారు 1,60,441 రైతుల అకౌంట్లలోకి అన్నదాత సుఖీభవ 2వ విడత రూ.5,000, పీఎం కిసాన్ 21వ విడత రూ.2,000 కలిపి మొత్తంగా రూ.7,000లు బుధవారం జమ కానున్నాయి. ఈ మేరకు జిల్లా ఇన్‌ఛార్జి డీఏవో కె.అన్నపూర్ణమ్మ వివరాలను మంగళవారం వెల్లడించారు. జిల్లాలోని 25 మండలాల్లోని రైతులకు రూ.107.21 కోట్ల లబ్ధి చేకూరనున్నట్లు ఆమె తెలిపారు.

Similar News

News March 22, 2026

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.190, మాంసం 300 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.310 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 22, 2026

నాగాయలంక మత్స్యకార బిడ్డ.. అంతర్జాతీయ ఖ్యాతి!

image

కృష్ణా (D) నాగాయలంకకు చెందిన మత్స్యకార బిడ్డ నాగిడి గాయత్రి క్రీడా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కోర్సెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్’ను ఆమె పూర్తి చేసింది. శనివారం జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ కోచ్‌ల చేతుల మీదుగా ఆమె సర్టిఫికెట్, అవార్డు అందుకున్నారు. గాయత్రి ప్రతిభను గుర్తించిన గ్రామస్థులు, కోచ్‌లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

News March 22, 2026

ప్రకాశం: ‘నేడు కూడా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు’

image

ప్రకాశం జిల్లాలో ఆదివారం కూడా విద్యుత్ బిల్లు కౌంటర్లు తెరిచి ఉంటాయని SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. వినియోగదారుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలోని అన్ని కౌంటర్లు పనిచేస్తాయని వెల్లడించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్ణీత సమయంలో బిల్లు చెల్లించడం వలన పెనాల్టీ పడదని అన్నారు. ఆన్‌లైన్‌లో కూడా బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు.