News November 19, 2025

బాపుఘాట్ సుందరీకరణ.. DECలో ప్రారంభం!

image

HYD మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా గండిపేట నుంచి బాపూఘాట్ వరకు సరికొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్లానింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ నది సుందరీకరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్లో పనులు ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Similar News

News March 15, 2026

కామారెడ్డి: ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణలో మార్పులు

image

కామారెడ్డి జిల్లాలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ విధానంలో మార్పులు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జనగణన-2027 శిక్షణ కార్యక్రమాల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను కలెక్టరేట్‌లోని 25వ నంబర్ గదిలో స్వీకరించనున్నట్లు వివరించారు.

News March 15, 2026

కాణిపాకం: 17న అత్యవసర ధర్మకర్తల మండలి సమావేశం

image

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 17న ఉదయం 10:30 గంటలకు అత్యవసర ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి పెంచల కిశోర్ తెలిపారు. యుద్ధ పరిస్థితులు, అవసరమైన సరుకుల సరఫరా, ప్రసాదానికి ఉపయోగించే గ్యాస్ సరఫరా సంబంధిత ఏర్పాట్లపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశానికి ధర్మకర్తల మండలి ఛైర్మెన్, సభ్యులు, అధికారులు హాజరుకావాలని వారు కోరారు.

News March 15, 2026

కామారెడ్డి: డిజిటల్ పద్ధతిలో జనగణన: అదనపు కలెక్టర్

image

2026-27 జనగణన దశ-1 గృహ జాబితా, గృహ గణన కార్యక్రమంపై జిల్లా స్థాయి అధికారులకు కలెక్టరేట్‌లో ఆదివారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ.. డిజిటల్ పద్ధతిలో జనగణనను సమర్థవంతంగా చేపట్టాలన్నారు. ఈ శిక్షణా మార్చి 15 నుంచి 17 వరకు IDOC సమావేశ మందిరంలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.