News November 19, 2025

బాలికను రెండేళ్లుగా చీకటి గదిలో నిర్బబంధించిన తల్లి

image

చీకటి గదిలో రెండేళ్లుగా మగ్గుతున్న ఓ బాలికకు న్యాయాధికారి చొరవతో విముక్తి లభించింది. ఈ ఘటన ఇచ్ఛాపురంలోని చక్రపాణి వీధిలో నిన్న వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి మరణంతో మానసికంగా కుంగిపోయిన తల్లి ఆడపిల్లను బయటకు పంపితే ఏం జరుగుతుందోని భయంతో ఇలా బంధించింది. స్థానికుల సమాచారంతో న్యాయాధికారి, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు వీరిద్దర్నీ బయటకి తీసుకొచ్చారు. పరిస్థితి బాగాలేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 27, 2026

SKLM: ఉద్యోగాలిప్పిస్తామని భారీ మోసం..!

image

పలాస(M) ఉదయపురం కాలానికి చెందిన రాజాన కూర్మారావుకు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కొందరు వ్యక్తులు అతని నుంచి రూ.లక్షల్లో నగదు కాజేసి మోసం చేశారు. ఈ ఘటనలో 2014లో పలాస పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గురువారం వాదనలు విన్న పలాస మున్సిప్ కోర్ట్ నేరం రుజువు కావడంతో నిందితులకు 6 నెలల జైలు శిక్ష, రూ.4,500 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.

News March 26, 2026

పొందూరులో 32 ఏళ్ల యువకుడు సూసైడ్

image

పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన శ్రావణ్ కుమార్(32) గురువారం ఉరివేసుకొని మృతి చెందినట్లు ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు. కుటుంబ కలహాలు నేపథ్యంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో శ్రవణ్ ఉరివేసుకున్నట్లు ఆయన తెలిపారు. శ్రావణ్ మరణంతో తల్లిదండ్రులు, భార్య కన్నీటి పర్యంతమయ్యరు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 26, 2026

ఎచ్చెర్లలో యాక్సిడెంట్..తల్లీ, కుమారుడు మృతి

image

ఎచ్చెర్ల మండలం అక్కివలస జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు..విశాఖకు చెందిన నరేంద్ర కుమార్ తల్లితో కలిసి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఎచ్చెర్ల హైవే‌పై వెనక నుంచి లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.