News November 19, 2025

ఖమ్మం: మార్చురీలో శవాలపై కక్కుర్తి వసూళ్లు

image

శవాలపై పేలాలు ఏరుకోవడం అనే డైలాగ్ వినే ఉంటాం. ఇలాంటి ఘటనే ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీ సిబ్బంది వ్యవహారంతో స్పష్టంగా కనిపిస్తుంది. పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని అప్పగించేందుకు రూ.3-5 వేల వరకు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి ఏడాదికి 1000కి పైగా మృతదేహాలు వస్తున్న నేపథ్యంలో ఈ దందాపై వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Similar News

News March 13, 2026

ఇళ్ల నిర్మాణాల్లో చిత్తూరు జిల్లాకు తొలి స్థానం

image

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో చిత్తూరు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు. పీఎంఏవై పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉంది. 74,199 ఇళ్లకుగానూ 64,928 నిర్మాణాలను పూర్తి చేసి 88 శాతం లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఉగాది నాటికి 8,855 ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యం చేసుకోగా.. ఇప్పటికే 8,481 ఇళ్లు పూర్తయ్యాయి.

News March 13, 2026

నేడే పీఎం కిసాన్ నిధులు విడుదల

image

పీఎం కిసాన్ 22వ విడత నిధులను కేంద్రం ఇవాళ విడుదల చేయనుంది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఈ డబ్బులను రిలీజ్ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా అర్హులైన 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో.. రూ.18,640 కోట్లను జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2019 నుంచి కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలను వ్యవసాయ పెట్టుబడి సాయం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.

News March 13, 2026

పీఎం కిసాన్ అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి?

image

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఇలా చెక్ చేసుకోండి. ☛ ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించాలి.
☛ ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
☛ అక్కడ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం (మీ వ్యవసాయ భూమి ఉన్న గ్రామం) వివరాలను ఎంపిక చేసుకొని ‘గెట్ రిపోర్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
☛ అక్కడ గ్రామాల వారీగా లబ్దిదారుల జాబితా వస్తుంది.