News April 13, 2024
సంగారెడ్డిలో బీజేపీకి షాక్..

ఎన్నికల వేళ బీజేపీకి మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో షాక్ తగిలింది. ఆ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ ఛార్జీ, సదాశివపేట మున్సిపల్ కౌన్సిలర్ పులి మామిడి రాజు హస్తం గూటికి చేరారు. నేడు హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలోకాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, జగ్గారెడ్డి, ఎంపీ అభ్యర్థి నీలం మధు పాల్గొన్నారు.
Similar News
News March 13, 2026
నర్సాపూర్: ‘గ్యాస్ కొరత సృష్టిస్తే జైలుకే’

జిల్లాలో కృత్రిమ గ్యాస్ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్ఓ నిత్యానంద్ హెచ్చరించారు. నర్సాపూర్‌లో పలు హోటళ్లు, రీఫిల్లింగ్ కేంద్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 47 సిలిండర్లను స్వాధీనం చేసుకుని, నిత్యావసర వస్తువుల చట్టం 6A కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గ్యాస్ అక్రమ విక్రయాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.
News March 13, 2026
మెదక్: ఇంటర్ పరీక్షలకు 98.12 % హాజరు

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 4,801 మందికి గాను 4,711 మంది, ఒకేషనల్ విభాగంలో 267 మందికి గాను 262 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 98.12 శాతం హాజరు నమోదైందని అధికారి మాధవి తెలిపారు. నేటితో జనరల్ విభాగం పరీక్షలు పూర్తయ్యాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆమె పేర్కొన్నారు.
News March 13, 2026
మెదక్: ఇంటర్ విద్యార్థులకు యాక్సిడెంట్

టేక్మాల్ మండలం కద్దులూరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తప్పులర్ నుంచి అల్లాదుర్గ్ పరీక్షా కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు ఇంటర్ విద్యార్థులు అదుపుతప్పి చెట్టును ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన వీరిని 108 సిబ్బంది మహేష్ కుమార్, దుర్గయ్య ప్రథమ చికిత్స అందించి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్ష రాయాల్సిన విద్యార్థులు ప్రమాదానికి గురవ్వడంతో గ్రామంలో విషాదం నెలకొంది.


