News April 13, 2024

ALERT: 3 రోజులే ఛాన్స్

image

కొత్త ఓట్ల నమోదుకు ECI విధించిన గడువు మరో 3 రోజుల్లో ముగియనుంది. ఓటర్ లిస్టులో పేరు లేని 18+ వారంతా ఈనెల 15లోగా ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. <>ఆన్‌లైన్‌లో<<>> లేదా సంబంధిత రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాల్లో ఫాం-6ను సమర్పించాలని తెలిపారు. నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుందని, కానీ చివరిదాకా ఆగకుండా 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవడం మంచిదని చెప్పారు.

Similar News

News October 11, 2024

నేను ఆడపిల్లనని భారంగా భావించారు: మల్లిక

image

ఆడపిల్ల పుట్టిందని తనను తల్లిదండ్రులు భారంగా భావించారని బాలీవుడ్ బ్యూటీ మల్లిక షెరావత్ తెలిపారు. ‘నా సోదరుడిని ఆప్యాయంగా చూసేవారు. అతణ్ని ఉన్నతంగా చదివించాలి, విదేశాలకు పంపించాలనుకునేవారు. ఆస్తులు కూడా తమ్ముడికే చెందాలనుకునేవారు. అమ్మాయిలు ఏం పాపం చేశారు? నన్ను చదివించారు కానీ స్వేచ్ఛనివ్వలేదు. నన్నెప్పుడూ అర్థం చేసుకోలేదు. నేను పుట్టినప్పుడు మా అమ్మ డిప్రెషన్‌లోకి వెళ్లుంటుంది’ అని నిట్టూర్చారు.

News October 11, 2024

ట్రిలియన్ డాలర్లు దాటిన భారత కుబేరుల సంపద!

image

భారత కుబేరుల సంపద మొత్తం కలిపి తొలిసారిగా ట్రిలియన్ డాలర్లను దాటిందని ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది. 2019తో పోలిస్తే వారి సంపద రెట్టింపైందని తెలిపింది. ఒక్క 2023లోనే వారు 316 బిలియన్ డాలర్లను సంపాదించారని పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ పాజిటివ్‌గా ఉందని కొనియాడింది. కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ (119.5 బిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో ఉన్నారు. అదానీ(116 బిలియన్ డాలర్లు) 2వ స్థానంలో నిలిచారు.

News October 11, 2024

బెల్లీ ల్యాండింగ్ అంటే ఏంటి..?

image

విమానం టేకాఫ్‌, ల్యాండింగ్‌లో ల్యాండింగ్ గేర్ అనేది కీలకం. ఇది విమాన చక్రాలు, స్ట్రట్స్, షాక్ అబ్సార్బర్స్‌తో అనుసంధాన‌మై పనిచేస్తుంది. ఇందులో సమస్య ఏర్పడి చక్రాలు తెరుచుకోని పరిస్థితుల్లో బెల్లీ ల్యాండింగ్ చేస్తారు. అంటే విమానాన్ని చ‌క్రాల ద్వారా కాకుండా నేరుగా విమానం మ‌ధ్య భాగం (బెల్లీ) భూమిని తాకేలా ల్యాండ్ చేస్తారు. అత్యంత ప్ర‌మాద‌కర ప‌రిస్థితుల్లో చివ‌రి అవ‌కాశంగా దీనికి అనుమ‌తిస్తుంటారు.