News November 18, 2025

పెద్దపల్లి: ‘నిషేధిత ఔషధాలు విక్రయించవద్దు’

image

నిషేధిత ఔషధాలను విక్రయించవద్దని, ఔషధాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రవణ్ కుమార్ మెడికల్ షాపు యజమానులను సూచించారు. పెద్దపల్లి, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో సోమవారం ఔషధ దుకాణాలలో ఆయన తనిఖీలు నిర్వహించారు. GST స్లాబ్ రేట్ ప్రకారం ఔషధాలు విక్రయించాలన్నారు. డాక్టర్ మందుల చీటీ లేకుండా ఔషధాలు విక్రయించవద్దని, నిషేధిత ఔషధాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News November 18, 2025

రేపు అకౌంట్లలోకి రూ.7,000.. ఇలా చేయండి

image

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపు రైతుల అకౌంట్లలో రూ.7వేలు జమచేయనుంది. కడప జిల్లాలోని పెండ్లిమర్రిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాగా రైతులు ఆన్‌లైన్‌లో <>annadathasukhibhava.ap.gov.in<<>> ద్వారా తమ అర్హతను తెలుసుకోవచ్చు. పోర్టల్‌కి వెళ్లి Know Your Statusలో వివరాలను ఎంటర్ చేస్తే ఎలిజిబుల్/కాదో తెలుస్తుంది.

News November 18, 2025

జడ్చర్ల: అగ్ని ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే

image

జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.. వారి వివరాలు పప్పు (ఒడిశా) హరేందర్( బిహార్) అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పప్పున్, సాతి మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 18, 2025

ఆంక్షలున్నా US వైపే మన విద్యార్థుల చూపు

image

ఆంక్షలున్నప్పటికీ భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులకోసం అమెరికా వైపే చూస్తున్నారు. ‘ఓపెన్ డోర్స్’ నివేదిక ప్రకారం 2024-25లో USలో 11,77,766 మంది విదేశీ విద్యార్థులు చేరగా వారిలో 3,63,019 మంది భారతీయులే. గత ఏడాదితో పోలిస్తే 10% పెరుగుదల ఉంది. చైనీయులు 2,65,919 మంది కాగా ముందటేడాదికన్నా 4% తగ్గుదల నమోదైంది. మొత్తం విద్యార్థుల్లో 57% STEM కోర్సులకు ప్రాధాన్యమిస్తుండగా వారిలోనూ ఇండియన్స్‌దే అగ్రభాగం.