News November 19, 2025
GNT: తెలుగు సాహితీవేత్త మద్దిపట్ల సూరి సేవలు అజరామరం

సాహిత్య విమర్శకుడు మద్దిపట్ల సూరి తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగంలో సుపరిచితుడు. 1916, జులై 7న తెనాలి సమీపంలో ఆయన జన్మించారు. తెలుగు అకాడమీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా కీలక సేవలు అందించారు. అకాడమీ ద్వారా తెలుగులో విజ్ఞాన, శాస్త్ర సంబంధిత గ్రంథాల ప్రచురణకు ఆయన విశేష కృషి చేశారు. సూరి తెలుగు భాషాభివృద్ధికి, విద్యా సంబంధిత పుస్తకాల విస్తరణకు తమ జీవితాన్ని అంకితం చేశారు. 1995 నవంబర్ 19న మరణించారు.
Similar News
News March 12, 2026
GOOD NEWS గుంటూరు: రేపే నగదు జమ

అన్నదాత సుఖీభవ-PM కిసాన్ పథకం మూడో విడత నిధులు శుక్రవారం గుంటూరు జిల్లా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. జిల్లాలోని 1,06,329 మంది రైతులకు రూ.59.28 కోట్ల నిధులు ఖాతాల్లో జమ చేసేందుకు గురువారం అధికారులు చర్యలు తీసుకున్నారు. వీటిలో రూ.42.53 కోట్లు అన్నదాత సుఖీభవ కాగా, రూ.16.75 కోట్లు PM కిసాన్ నిధులుగా చెప్పారు. ఈ విడతలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,000ల చొప్పున జమ అవుతాయన్నారు.
News March 12, 2026
గుంటూరులో LPG సిలిండర్ల స్వాధీనం

విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు గురువారం గుంటూరులో దాడులు నిర్వహించారు. వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్న గృహ వినియోగ LPG సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వీట్ షాపులు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో తనిఖీలు చేసి మొత్తం 26 సిలిండర్లు సీజ్ చేశారు. ఈ ఘటనపై ఎస్సెంటీల కమోడిటీస్ యాక్ట్, 1955 సెక్షన్ 6-A కింద 6 కేసులు నమోదు చేసి సంబంధిత అధికారులకు నివేదిక అందించారు.
News March 12, 2026
‘జిల్లాలో శనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి’

జిల్లాలో శనగల కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్‌లో గురువారం జేసీ అశుతోష్ శ్రీవాత్సవకు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకారం శనగ పంటకు క్వింటాకు రూ.5,875 ఉన్నా మార్కెట్లో రూ4,500 మాత్రమే ధర లభిస్తుందని జేసీకి వివరించారు. కొనుగోళ్ల కేంద్రాలను పెంచి సమస్యను పరిష్కరించాలన్నారు. వినతి ఇచ్చినవారిలో తిరుపతిరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


