News November 18, 2025
ఎన్‌కౌంటర్స్ మొత్తం ఫేక్: కూనంనేని

మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్లు మొత్తం ఫేక్ అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మావోయిస్టులను చంపుకుంటూ పోవడం మానవ హననమేనని, ఇది జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ పోలీసులు ఇందులో పావులుగా మారారని ఆరోపించారు. మాడేరుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌తో సహా అన్ని ఎన్‌కౌంటర్లు కట్టుకథలని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News November 18, 2025
రేపు అకౌంట్లలోకి రూ.7,000.. ఇలా చేయండి

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపు రైతుల అకౌంట్లలో రూ.7వేలు జమచేయనుంది. కడప జిల్లాలోని పెండ్లిమర్రిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాగా రైతులు ఆన్‌లైన్‌లో <
News November 18, 2025
జడ్చర్ల: అగ్ని ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే

జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.. వారి వివరాలు పప్పు (ఒడిశా) హరేందర్( బిహార్) అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పప్పున్, సాతి మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 18, 2025
ఆంక్షలున్నా US వైపే మన విద్యార్థుల చూపు

ఆంక్షలున్నప్పటికీ భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులకోసం అమెరికా వైపే చూస్తున్నారు. ‘ఓపెన్ డోర్స్’ నివేదిక ప్రకారం 2024-25లో USలో 11,77,766 మంది విదేశీ విద్యార్థులు చేరగా వారిలో 3,63,019 మంది భారతీయులే. గత ఏడాదితో పోలిస్తే 10% పెరుగుదల ఉంది. చైనీయులు 2,65,919 మంది కాగా ముందటేడాదికన్నా 4% తగ్గుదల నమోదైంది. మొత్తం విద్యార్థుల్లో 57% STEM కోర్సులకు ప్రాధాన్యమిస్తుండగా వారిలోనూ ఇండియన్స్‌దే అగ్రభాగం.


