News November 19, 2025
మామడ: ఆటో, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

మామడ మండల్ కొరిటికల్ ఎక్స్ రోడ్డు దుర్గ తండా దగ్గర ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. భరత్ చేయి తెగిపోయి పరిస్థితి విషమంగా ఉండగా, తుకారాం కాలు నుజ్జునుజ్జయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు మహారాష్ట్రకు చెందిన కూలీలని.. కోరిటికల్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. పని నిమిత్తం నిర్మల్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Similar News
News March 10, 2026
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో ACB అధికారుల సోదాలు

విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ACB అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారి రమణమూర్తితో పాటు పలువురు సిబ్బందిపై వచ్చిన అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. సోదాల్లో కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అక్రమ లేఅవుట్లు, నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో లోతైన విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
News March 10, 2026
బాసర నుంచి భద్రాద్రి వరకు.. ఆధ్యాత్మిక శోభ

గోదావరి పుష్కరాల లోపు బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న పురాతన ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రముఖ పుణ్యక్షేత్రాలను ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. ముఖ్యంగా భద్రాచలం ఆలయ అభివృద్ధి ప్రణాళికను సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన ఆమోదం పొందాలని సూచించారు.
News March 10, 2026
కామారెడ్డి: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు 453 మంది గైర్హాజరు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 453 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం జరిగిన పరీక్షలకు 8026 మంది విద్యార్థులకు గాను 7573 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. మొత్తంగా 94.36% మంది విద్యార్థులు హాజరయ్యారని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసామని పేర్కొన్నారు.


