News November 19, 2025
కామారెడ్డి: కోడలిని హత్య చేసిన అత్తకు జీవిత ఖైదు

కోడలిపై పెట్రోల్ పోసి హత్య చేసిన కేసులో నిందితురాలైన అత్తకు జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ KMR జిల్లా న్యాయమూర్తి CH.VRR వరప్రసాద్ తీర్పు చెప్పారు. నిజాంసాగర్(M) అచ్చంపేటకు చెందిన అంబవ్వ, ఆమె కోడలు కీర్తన(22)ను నిరంతరం వేధించేది. పెట్రోల్‌ను ఆమెపై చల్లి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. నేరం రుజువు కావడంతో కోర్టు నిందితురాలికి శిక్ష విధించింది.
Similar News
News March 14, 2026
హాస్టళ్లలో కట్టెల పొయ్యిలపై వంట.. ఐటీ కారిడార్‌లో పొగ

TG: హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ల కొరతతో చాలా వరకు హాస్టళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. దీంతో ఐటీ కారిడార్‌లో బిల్డింగుల మధ్య నుంచి పొగ వ్యాపిస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. ఇప్పటికే చాలా పీజీలు, హాస్టళ్లలో టిఫిన్లు ఆపేశారు. తక్కువ గ్యాస్ వినియోగంతో పూర్తయ్యే వంటలే చేస్తున్నారు.
News March 14, 2026
ఒక్క రోజులో 1.34లక్షల ఇండక్షన్ స్టవ్స్ విక్రయం

దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో వీటి విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. సాధారణంగా నెలకు 1.80 లక్షల అమ్మకాలు జరిగే చోట ఒక్క రోజే అమెజాన్‌లో 1.34 లక్షలకు పైగా స్టవ్‌లు అమ్ముడయ్యాయి. ఈ అనూహ్య డిమాండ్‌ను కంపెనీలు సైతం ఊహించకపోవడంతో చాలాచోట్ల ‘అవుట్ ఆఫ్ స్టాక్’ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
News March 14, 2026
శ్రీగిరిలో ఉగాది కోలాహలం

శ్రీశైలం క్షేత్రం ఉగాది ఉత్సవాలకు సిద్ధమైంది. ఈ వేడుకల కోసం కర్ణాటక నుంచి కన్నడ భక్తులు భారీగా తరలివస్తున్నారు. క్షేత్రమంతా భజనలు, నృత్యాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సోమవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పాదయాత్రగా వస్తున్న భక్తుల శివనామస్మరణతో నల్లమల కొండలు మారుమోగుతున్నాయి. భక్తుల రాకతో శ్రీగిరి పరిసరాలు కిక్కిరిసిపోయాయి.


