News November 18, 2025
NGKL: జిల్లా ఎస్పీ కార్యాలయంలో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఏఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 18, 2025
వైద్య అధికారులకు పల్నాడు కలెక్టర్ ఆదేశాలు

ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు సంబంధించిన అన్ని బకాయిలను 15 రోజుల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట ఏరియా ఆసుపత్రుల వైద్య అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టులో ఉన్న సౌకర్యాల స్థాయిని, నిధుల ఉత్పత్తిని కలెక్టర్ సమీక్షించారు.
News November 18, 2025
కడపలో సీఎం పర్యటన ఇలా.!

రేపు పెండ్లిమర్రిలో ఏర్పాటు చేసిన PM కిసాన్, అన్నదాత సుఖీభవ 2వ విడత నిధుల విడుదల కార్యక్రమానికి CM చంద్రబాబు రానున్నారు. ఆయన పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు.
☛ 1:25PM: పెండ్లిమర్రి (M) వెల్లటూరులోని హెలిప్యాడ్ వద్దకు వస్తారు
☛ 1:40 PM-4 PM: ప్రజావేదికలో ప్రసంగం
☛ 4:20 PM-5:05 PM: రైతులతో మాట్లాడతారు
☛ 5:15 PM- 6:15 PM: కార్యకర్తలతో మీటింగ్
☛ 6:50 PM: విజయవాడకు తిరుగు పయనమవుతారు.
News November 18, 2025
ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించండి

జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. మంగళవారం ఐడిఓసి సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు చలి కాలంలో ఇబ్బందులు లేకుండా కిటికీలు మరమ్మతులు చేయించుకోవాలన్నారు.


