News November 19, 2025

మామడ: ఆటో, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

image

మామడ మండల్ కొరిటికల్ ఎక్స్ రోడ్డు దుర్గ తండా దగ్గర ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. భరత్ చేయి తెగిపోయి పరిస్థితి విషమంగా ఉండగా, తుకారాం కాలు నుజ్జునుజ్జయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు మహారాష్ట్రకు చెందిన కూలీలని.. కోరిటికల్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. పని నిమిత్తం నిర్మల్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Similar News

News March 14, 2026

మెదక్: 11న పెళ్లి చూపులు.. యువతి MISSING

image

మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన సురేఖ(22) ఇస్నాపూర్‌లో అదృశ్యమైంది. తన బంధువు వికాస్ ఇంటికి వచ్చిన ఆమె, ఈ నెల 11న పెళ్లి చూపుల కోసం డ్రెస్ కొంటానని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పటాన్‌చెరు పోలీసులు సురేఖ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News March 14, 2026

ట్రంప్.. వాటిని బూడిద చేస్తాం: IRGC

image

ఖర్గ్ ద్వీపంలోని (ఇరాన్) ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దాడి చేస్తామన్న US అధ్యక్షుడు ట్రంప్ <<19377504>>హెచ్చరికపై<<>> IRGC దీటుగా స్పందించింది. ‘ఉగ్రవాది ట్రంప్ ఇరాన్ ఆయిల్, ఎనర్జీ, ఎకనామిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దాడి చేస్తామని దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అలా చేస్తే అమెరికా భాగస్వామ్యం ఉన్న అన్ని ఆయిల్, ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లపై అటాక్ చేస్తామని ఇదివరకే హెచ్చరించాం. వాటిని బూడిద చేసేస్తాం’ అని హెచ్చరించింది.

News March 14, 2026

గ్యాస్ అక్రమాలపై కఠిన చర్యలు: DSO చందన్ కుమార్

image

ఖమ్మం జిల్లాలో గృహావసరాల గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSO చందన్ కుమార్ హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ ఉంచడం సహించబోమన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని వినియోగదారులు ఆందోళన చెందవద్దన్నారు. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన వారికి సక్రమంగా సిలిండర్లు పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశించారు.