News November 19, 2025

ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

image

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్‌లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.

Similar News

News April 9, 2026

సిరి వెంకటాపూర్‌లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కోయిలకొండ మండలం సిరి వెంకటపూర్‌లో 41.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. నవాబుపేట 40.8, మహమ్మదాబాద్ 40.6, కౌకుంట్ల 40.5, చిన్న చింతకుంట 40.3, భూత్పూర్ 40.0, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 39.8, మిడ్జిల్ మండలం దోనూరు, మూసాపేట మండలం జానంపేట 39.6, మహబూబ్‌నగర్ అర్బన్ 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

News April 8, 2026

MBNR: ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి: కలెక్టర్

image

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. మంగళవారం హన్వాడ, వేపూర్ గురుకుల బాలికల పాఠశాలలను ఆమె సందర్శించారు. పదో తరగతి పరీక్షలు జీవితంలో కీలకమైనవని, భయం వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు పోషకాహారం అందించాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.