News November 19, 2025
మామడ: ఆటో, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

మామడ మండల్ కొరిటికల్ ఎక్స్ రోడ్డు దుర్గ తండా దగ్గర ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. భరత్ చేయి తెగిపోయి పరిస్థితి విషమంగా ఉండగా, తుకారాం కాలు నుజ్జునుజ్జయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు మహారాష్ట్రకు చెందిన కూలీలని.. కోరిటికల్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. పని నిమిత్తం నిర్మల్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Similar News
News March 15, 2026
రేపటి నుంచి మ.12.30 గం. వరకే స్కూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో 7.45AM నుంచి 12.30PM వరకు తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. అటు తెలంగాణలో 8AM నుంచి 12.30PM వరకు తరగతులు ఉంటాయి. రెండు రాష్ట్రాల్లో స్కూల్ ముగిశాక మధ్యాహ్న భోజనం పెట్టి పిల్లలను ఇంటికి పంపించనున్నారు.
News March 15, 2026
పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. పుట్టపర్తి(M) చిన్నపల్లి జడ్పీ హైస్కూల్‌ను సందర్శించి, పరీక్షలు రాయనున్న విద్యార్థులతో ఆయన మాట్లాడి ధైర్యం చెప్పారు. పరీక్షలు నమ్మకంగా రాయాలని సూచిస్తూ.. చదువుకు ఉపయోగపడే పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో డీఈవో క్రిష్టప్ప, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
News March 15, 2026
యుద్ధం.. ట్రంప్‌కు కామెడీ అయిపోయింది!

ప్రపంచ గమనాన్ని మార్చే యుద్ధాలను డొనాల్డ్ ట్రంప్ ఒక ‘కామెడీ’గా మార్చేశారని నిపుణులు మండిపడుతున్నారు. ఖార్గ్ దీవులపై ‘<<19386343>>ఫన్నీ<<>>’గా దాడులు చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు యుద్ధాన్ని ఆయన ఎంత లైట్ తీసుకుంటున్నారో సూచిస్తున్నాయి. మరోవైపు ‘ఈరోజు దారుణంగా దాడి చేస్తాం. ఈ వారంలో ఇరాన్‌ను కోలుకోలేని విధంగా దెబ్బ కొడతాం’ అంటూ చేసే ప్రకటనలు ఆయన బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.


