News November 19, 2025
మామడ: ఆటో, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

మామడ మండల్ కొరిటికల్ ఎక్స్ రోడ్డు దుర్గ తండా దగ్గర ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. భరత్ చేయి తెగిపోయి పరిస్థితి విషమంగా ఉండగా, తుకారాం కాలు నుజ్జునుజ్జయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు మహారాష్ట్రకు చెందిన కూలీలని.. కోరిటికల్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. పని నిమిత్తం నిర్మల్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Similar News
News March 5, 2026
బెంబేలెత్తున్న కర్నూలు జిల్లా ప్రజలు

మధ్యాహ్నం ఎండలు, రాత్రి ఉక్కపోతతో కర్నూలు జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతం, గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో వేర్వేరుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల వల్ల వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో బుధవారం కర్నూలు జిల్లాలో 38.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
News March 5, 2026
పాలమూరు: కోడి తెచ్చిన కొట్లాట.. ముగ్గురిపై కేసు

కుటుంబ వివాదంతో ఒకరిపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైనట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు గౌడ్ తెలిపారు. లింగాలకు చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తి ఇంట్లో కోడి చనిపోవడంతో దంపతుల మధ్య ఘర్షణ తలెత్తింది. భార్యను భర్త మందలించడంతో మల్లికార్జున్ మామ రత్నయ్య, వెంకటేశ్, శేఖర్ అతడిపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన మల్లికార్జున్ పోలీసులను ఆశ్రయించగా, నిందితులపై కేసు నమోదు చేశారు.
News March 5, 2026
తూ.గో: కల్తీ పాల ఘటనలో మరొకరి మృతి

రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో మృతుల సంఖ్య బుధవారం నాటికి 8కి చేరింది. తాజాగా సూర్యకుమారి అనే మహిళ మృతి చెందగా, మృతుల్లో ఆరేళ్ల బాలుడు సహా ఏడుగురు వృద్ధులు ఉన్నారు. ప్రస్తుతం 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో 9 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తున్నప్పటికీ బాధితుల పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


