News November 19, 2025
మామడ: ఆటో, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

మామడ మండల్ కొరిటికల్ ఎక్స్ రోడ్డు దుర్గ తండా దగ్గర ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. భరత్ చేయి తెగిపోయి పరిస్థితి విషమంగా ఉండగా, తుకారాం కాలు నుజ్జునుజ్జయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు మహారాష్ట్రకు చెందిన కూలీలని.. కోరిటికల్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. పని నిమిత్తం నిర్మల్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Similar News
News March 5, 2026
నాగోల్: CM రేవంత్‌కు KTR వార్నింగ్

CM రేవంత్ ఇల్లు రెడ్డి కుంటలో ఉందని KTR అన్నారు. నాగోల్ STP పరిశీలన అనంతరం ఆయన ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. CM సోదరుడి ఇల్లు కూడా దుర్గం చెరువులో ఉందని, మంత్రుల ఇండ్లు కూడా చెరువుల మధ్యలో ఉన్నాయని ఆరోపించారు. వాటిని కూల్చే దమ్ము ఎవరికీ లేదన్నారు. అదే పేదవాడి భూమికి రిజిస్ట్రేషన్లు ఉన్నా కూల్చివేస్తున్నారని.. కానీ, పేదలు కుర్చి మడతపెట్టి కొట్టే రోజులు వస్తాయని CMకు KTR వార్నింగ్ ఇచ్చారు.
News March 5, 2026
ADB: ఇంటర్ పరీక్షకు 473 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 8123 మంది విద్యార్థులకు గాను 7650 మంది హాజరయ్యారని డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 7104 విద్యార్థులకు గాను 348 మంది, ఒకేషనల్ విభాగంలో 1019.విద్యార్థులకు గాను 125 మంది కలిపి మొత్తం 473 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.
News March 5, 2026
బిడ్డను ఒడిలో పెట్టుకుని.. ఆధార్ సేవలు అందిస్తూ..

మాతృత్వపు బాధ్యతలను నిర్వహిస్తూనే.. వృత్తి పట్ల అంకితభావం చాటుతున్నారు ఆధార్ ఆపరేటర్ భూక్యా వెన్నెల. పాల్వంచ మండలం బసవతారక కాలనీ గ్రామ పంచాయతీలోని ఆధార్ సేవా కేంద్రంలో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ఏడాది వయసున్న తన చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని నిత్యం వందలాది మందికి ఆధార్ సేవలు అందిస్తున్న తీరు స్థానికులను ఆకట్టుకుంటోంది. ఆమె సేవా దృక్పథాన్ని చూసి అక్కడికి వచ్చే వారు ప్రశంసిస్తున్నారు.


