News November 19, 2025
మామడ: ఆటో, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

మామడ మండల్ కొరిటికల్ ఎక్స్ రోడ్డు దుర్గ తండా దగ్గర ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. భరత్ చేయి తెగిపోయి పరిస్థితి విషమంగా ఉండగా, తుకారాం కాలు నుజ్జునుజ్జయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు మహారాష్ట్రకు చెందిన కూలీలని.. కోరిటికల్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. పని నిమిత్తం నిర్మల్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Similar News
News March 28, 2026
విజయవాడ: పోలీసులమంటూ దోపిడీ..!

విజయవాడ వన్‌టౌన్‌లో పోలీసులమని అని చెప్పి మెడికల్ షాపులో సామాగ్రిని ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. కృష్ణమోహన్ అనే వ్యక్తి గతంలో భాగస్వామ్యంతో నడిపిన మెడికల్ షాపును, వివాదాల కారణంగా ప్రస్తుతం ఒంటరిగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు దుండగులు షాపులోకి ప్రవేశించి, తాము పోలీసులమని నమ్మించి లోపల ఉన్న సామాగ్రిని తీసుకెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 28, 2026
BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,510 పెరిగి రూ.1,48,090కు చేరింది. రెండు రోజుల్లోనే రూ.3,540 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,300 ఎగబాకి రూ.1,35,750 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.2,50,000గా ఉంది.
News March 28, 2026
నెల్లూరు కేబినెట్ రేసులో కొత్త పేర్లు

నెల్లూరు జిల్లాలో త్వరలో జరగబోయే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా కొత్త ముఖాలకు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి. మంత్రులుగా ఉన్న నారాయణ లేదా ఆనం రామనారాయణ రెడ్డిలలో ఒకరిని మారుస్తారనే ప్రచారం సాగుతోంది. వారి స్థానంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మహిళా కోటా లేదా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆయన పనితీరు, దూకుడును బట్టి మంత్రి పదవి ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.


