News November 19, 2025
మామడ: ఆటో, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

మామడ మండల్ కొరిటికల్ ఎక్స్ రోడ్డు దుర్గ తండా దగ్గర ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. భరత్ చేయి తెగిపోయి పరిస్థితి విషమంగా ఉండగా, తుకారాం కాలు నుజ్జునుజ్జయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు మహారాష్ట్రకు చెందిన కూలీలని.. కోరిటికల్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. పని నిమిత్తం నిర్మల్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Similar News
News March 11, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,930
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,656
*వెండి 10 గ్రాముల ధర రూ.2,720
News March 11, 2026
చర్లపల్లి- కామాఖ్య మధ్య కొత్తగా అమృత్ భారత్

అసోంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కామాఖ్య ఆలయాన్ని దర్శించేందుకు HYD నుంచి కొత్తగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. చర్లపల్లి నుంచి కామాఖ్య వరకు రాకపోకలు సాగించే ఈ ట్రైన్ ఈనెల 13న కామాఖ్యలో ప్రారంభం కానుంది. ఈ ట్రైన్లో 8 స్లీపర్ క్లాస్, 11 సాధారణ బోగీలు ఉంటాయి. ఇది తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం రోడ్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రిలలో ఇరు వైపులా ఆగుతుంది.
News March 11, 2026
నేటి ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 2,870 మంది హాజరు

కడప జిల్లాలో బుధవారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 2,870 మంది విద్యార్థులు హాజరయ్యారు. నేటి గణితం పరీక్ష 2,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 2,624 మంది పరీక్షలు రాశారు. 222 మంది ఆబ్సెంట్ అయ్యారు. హిస్టరీ పరీక్షకు 276 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా 246 మంది వచ్చారు. 30 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేదు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు.


