News November 19, 2025
నల్గొండ: నేటి నుంచి మళ్లీ పత్తి కొనుగోలు షురూ

జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు బందును విరమించాయి. సీసీఐ నిబంధనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిన్నింగ్ మిల్లులు మంగళవారం బంద్ పాటించాయి. దీంతో రంగంలోకి దిగిన సీసీఐ సీఎండీ జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మిల్లులను 2, 3 రోజుల్లో తెరుస్తామని హామీ ఇవ్వడంతో మిల్లుల యజమానులు బంద్ ఉపసంహరించుకున్నారు. నేటి నుంచి మళ్లీ పత్తి కొనుగోళ్లు చేయనున్నారు.
Similar News
News March 13, 2026
జగిత్యాల: జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కారాగారంలో శుక్రవారం ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎన్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో హెచ్ఐవి, హెపటైటిస్ B, Cతో పాటు రక్తపరీక్షలు ఉచితంగా నిర్వహించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల పాథాలజిస్ట్ డా. కె. ప్రవీణ్, ఖిలగడ్డ వైద్యాధికారి డా. సంతోష్, ఐసీటీసీ సిబ్బంది పాల్గొన్నారు.
News March 13, 2026
MBNR: పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: SP

పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. పరీక్షా సమయాల్లో (ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు) కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 163 BNSS యాక్ట్ ప్రకారం ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
News March 13, 2026
GNT: జగన్ పర్యటన వాయిదా.. ఇఫ్తార్ రాజకీయమే కారణం..!

గుంటూరులో ఇఫ్తార్ రాజకీయం రాజుకుంటుంది. ఇందుకు కారణం గుంటూరులో ఈ నెల 10న జగన్మోహన్ రెడ్డి పాల్గొనాల్సిన ఇఫ్తార్ విందు వాయిదా పడటమే అని YCPలో చర్చ జరుగుతుంది. లోకల్ నాయకుల ఆధిపత్యం కాస్త జగన్ పర్యటన వాయిదాకు కారణమైందని అంటున్నారు. స్థానిక నేతల మధ్య కోఆర్డినేషన్ కంటే క్రెడిట్ ఎవరిది అన్నదే పెద్ద చర్చ నడిచిందని, తూర్పు ఇన్‌ఛార్జ్ ఏర్పాట్లు కంటే హడావిడి చేస్తున్నారని కొందరు నేతలు మాట్లాడుకున్నారు.


