News November 19, 2025
కామారెడ్డి: కోడలిని హత్య చేసిన అత్తకు జీవిత ఖైదు

కోడలిపై పెట్రోల్ పోసి హత్య చేసిన కేసులో నిందితురాలైన అత్తకు జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ KMR జిల్లా న్యాయమూర్తి CH.VRR వరప్రసాద్ తీర్పు చెప్పారు. నిజాంసాగర్(M) అచ్చంపేటకు చెందిన అంబవ్వ, ఆమె కోడలు కీర్తన(22)ను నిరంతరం వేధించేది. పెట్రోల్‌ను ఆమెపై చల్లి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. నేరం రుజువు కావడంతో కోర్టు నిందితురాలికి శిక్ష విధించింది.
Similar News
News March 6, 2026
నేపాల్ రిజల్ట్స్.. లీడింగ్‌లో RSP

హిమాలయ దేశం నేపాల్‌లో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP) 32 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. పార్టీ చీఫ్ రబి లామిచానే, సీనియర్ నేత బాలెన్ షా ముందంజలో కొనసాగుతున్నారు. RSP విజయం సాధిస్తే బాలెన్ షా(ఫొటోలో) PM అయ్యే అవకాశం ఉంది. పూర్తి రిజల్ట్స్ ఇవాళ సాయంత్రంలోపు రానున్నాయి.
News March 6, 2026
VKB: హాస్టల్ నుంచి వెళ్లి.. లవ్ మ్యారేజ్

పర్మిషన్ లేకుండా హాస్టల్ నుంచి ఓ విద్యార్థిని వెళ్లిపోయిన ఘటన ఘట్‌కేసర్ PS పరిధిలో జరిగింది. SHO బాలస్వామి వివరాలిలా.. వికారాబాద్(D) ధారూర్‌కు చెందిన విద్యార్థిని(19) అంకుషాపూర్ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కాలేజీలో 2nd ఇయర్ చదువుతోంది. ఈ నెల 4న హాస్టల్ నుంచి వెళ్లింది. ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. VKBలో ప్రియుడితో వివాహం చేసుకున్నట్లు లోకల్ PS నుంచి ఘట్‌కేసర్ ఠాణాకు సమాచారమందింది.
News March 6, 2026
అందని వేతనాలు.. పంచాయతీ కార్మికుల అవస్థలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4,500 మంది పంచాయతీ కార్మికులు మూడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలైతేనే జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం చెత్త ట్రాక్టర్లకు డీజిల్ పోయడానికీ నిధులు లేక పారిశుద్ధ్య పనులు కుంటుపడుతున్నాయి. రెండు రోజిల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇస్తున్నా, కార్మికులు మాత్రం ఆకలితో అలమటిస్తున్నారు.


