News November 19, 2025
హిడ్మా ఎన్‌కౌంటర్‌లో ఏపీ పోలీసుల సక్సెస్

ఛత్తీస్‌గఢ్‌లో జన్మించిన హిడ్మాకు దక్షిణ బస్తర్ ప్రాంతంలో గట్టి పట్టు ఉండేది. చాలాసార్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. ఇతడిని అంతం చేస్తే చాలు మావోయిజం అంతం అవుతుందని పోలీసులు భావించేవారు. కొన్ని నెలలుగా వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సేఫ్ కాదని భావించిన హిడ్మా.. ఏపీవైపు వచ్చాడని తెలుస్తోంది. గత నెల నుంచే అతడిపై నిఘా వేసిన ఏపీ పోలీసులు పక్కా వ్యూహంతో హిడ్మాపై దాడి చేశారు.
Similar News
News March 5, 2026
రష్మిక చెల్లిని చూశారా?

రష్మిక-విజయ్ రిసెప్షన్ నిన్న HYDలో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత తొలిసారి రష్మిక ఫ్యామిలీ కెమెరాల కంటపడింది. దీంతో వారి వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె చెల్లి 14ఏళ్ల షిమాన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. రిసెప్షన్‌కు వచ్చిన అతిథులకు రష్మిక తన చెల్లిని పరిచయం చేస్తూ కనిపించారు. షిమాన్‌కు తనకు 15ఏళ్ల ఏజ్ గ్యాప్ వల్ల ఆమెను బిడ్డలా చూసుకుంటానని గతంలో రష్మిక తెలిపారు.
News March 5, 2026
తేరుకున్న మార్కెట్లు.. లాభాల్లో ప్రారంభం

ఇరాన్ వార్ వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా, నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత 3 సెషన్లలో భారీ నష్టాలు చవిచూడగా ఇవాళ ఇన్వెస్టర్లు అనూహ్యంగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో కోల్ ఇండియా, రిలయన్స్, అదానీ పోర్ట్స్, ONGC, NTPC షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
News March 5, 2026
దేశ భవిష్యత్తుకు ‘బరువు’ భయం!

<<19300696>>బాలల ఒబెసిటీ<<>> దేశ భవిష్యత్తును కలవరపెడుతోంది. ఇది కేవలం ఆరోగ్య సమస్యే కాదు మున్ముందు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. పిల్లలు బరువు పెరగడం కంటిన్యూ అయితే దీర్ఘకాలిక వ్యాధులొచ్చి హెల్త్‌కేర్ ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా భవిష్యత్ వర్క్‌ఫోర్స్ బలహీనపడుతుంది. అందుకే బడుల్లో వ్యాయామం తప్పనిసరి చేయాలి. స్కూళ్లు, ప్రభుత్వం కలిసి ఊబకాయంపై చైతన్యం తేవాలి. ఇంట్లో సమతుల ఆహారం అందేలా తల్లిదండ్రులు చూడాలి.


