News November 19, 2025

కామారెడ్డి: కోడలిని హత్య చేసిన అత్తకు జీవిత ఖైదు

image

కోడలిపై పెట్రోల్ పోసి హత్య చేసిన కేసులో నిందితురాలైన అత్తకు జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ KMR జిల్లా న్యాయమూర్తి CH.VRR వరప్రసాద్ తీర్పు చెప్పారు. నిజాంసాగర్(M) అచ్చంపేటకు చెందిన అంబవ్వ, ఆమె కోడలు కీర్తన(22)ను నిరంతరం వేధించేది. పెట్రోల్‌ను ఆమెపై చల్లి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. నేరం రుజువు కావడంతో కోర్టు నిందితురాలికి శిక్ష విధించింది.

Similar News

News March 23, 2026

జగిత్యాల ఎస్పీ గ్రీవెన్స్‌కు 12 ఫిర్యాదులు

image

జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా అర్జీదారుల సమస్యలను విన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, సమస్యల తీవ్రతను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News March 23, 2026

పీరియడ్స్‌లో దైవ దర్శనం చేసుకోవచ్చా?

image

తీర్థయాత్ర సమయంలో పీరియడ్స్ వస్తే దైవ దర్శనం చేసుకోవచ్చా? అన్న సందేహంపై ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ స్పష్టతనిచ్చారు. ‘నెలసరి అనేది ప్రకృతి సిద్ధమైన ప్రక్రియే కానీ పాపం కాదు. యాత్రలో పీరియడ్స్ వస్తే, స్నానం చేసి శుచిగా ఉండి దూరం నుంచే దేవుడిని దర్శించుకోవచ్చు. పూజా సామగ్రిని తాకడం, ప్రసాదం వండటం వంటివి చేయకూడదు. భగవంతుడికి కావాల్సింది కేవలం నిర్మలమైన భక్తి మాత్రమే’ అని వివరించారు.

News March 23, 2026

నిర్మల్: వీటిపైనే ఫిర్యాదులు ఎక్కువ

image

కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను కలెక్టర్ అభిలాష అభినవకు వినతులు సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ వసతి గృహాలు తనికి చేస్తూ ఉండాలని తెలిపారు.