News April 13, 2024
కంగన ప్రత్యర్థిగా విక్రమాదిత్య?

నటి కంగన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి BJP ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఆమెపై తన కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ను బరిలోకి దించనున్నట్లు సిట్టింగ్ ఎంపీ ప్రతిభా సింగ్ అన్నారు. విక్రమ్ పేరును అధిష్ఠానానికి సూచించానన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు.
Similar News
News March 17, 2026
SHOCKING: నిమ్మరసానికి గ్యాస్ బిల్లు

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో చాలా హోటళ్లు ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరిట అదనంగా వసూలు చేస్తున్నాయి. అయితే గ్యాస్ అవసరమే లేని పదార్థాలకు కూడా ఈ ఛార్జీలను అంటగట్టడం విమర్శలకు దారితీసింది. బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో కస్టమర్ 2 నిమ్మరసాలు ఆర్డర్ చేయగా రూ.358తో పాటు అదనంగా రూ.17(5%) గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ వేశారు. బిల్ ఫొటో వైరలవడంతో జ్యూస్‌కు గ్యాస్ బిల్ వేయడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.
News March 17, 2026
వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అంతకుముందు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సభ వాడీవేడిగా జరిగింది. ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజాపాలన అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు స్పష్టం చేశారు.
News March 17, 2026
పైపుల ద్వారా గృహాలకు KG బేసిన్ గ్యాస్: CBN

AP: రాష్ట్రంలో 14000 MT LPG నిల్వలు ఉన్నాయని, అదనపు గ్యాస్ రాబోతోందని CM CBN తెలిపారు. ప్రజలకు సరఫరాలో ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. గ్యాస్ సరఫరాపై అధికారులతో CM సమీక్షించారు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ మరింత విస్తరించే చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని కేజీ బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా ఇళ్లకు సరఫరా చేసేలా చూడాలని ఆదేశించారు.


