News November 19, 2025
కామారెడ్డి: కోడలిని హత్య చేసిన అత్తకు జీవిత ఖైదు

కోడలిపై పెట్రోల్ పోసి హత్య చేసిన కేసులో నిందితురాలైన అత్తకు జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ KMR జిల్లా న్యాయమూర్తి CH.VRR వరప్రసాద్ తీర్పు చెప్పారు. నిజాంసాగర్(M) అచ్చంపేటకు చెందిన అంబవ్వ, ఆమె కోడలు కీర్తన(22)ను నిరంతరం వేధించేది. పెట్రోల్‌ను ఆమెపై చల్లి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. నేరం రుజువు కావడంతో కోర్టు నిందితురాలికి శిక్ష విధించింది.
Similar News
News March 18, 2026
లవ్ ఫెయిల్.. మాచర్లలో యువతి సూసైడ్

ప్రేమ విఫలం కావడంతో యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన <<19358568>>మాచర్లలో<<>> బుధవారం వెలుగు చూసింది. పట్టణానికి చెందిన యువతి యువకుడితో ప్రేమలో పడింది. పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న కారణంతో ఇటీవల యువకుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 4 రోజుల క్రితం తల్లిదండ్రులకు యువతిని అప్పగించారు.ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
News March 18, 2026
ఈ గ్రామంలో ఉన్నట్టుండి నిద్రపోతారు!

కజకిస్థాన్‌లోని కలాచి అనే గ్రామంలో ప్రజలు ఎప్పుడు, ఎలా నిద్రపోతారో ఎవరికీ తెలియదు. నడుస్తున్నా, మాట్లాడుతున్నా సరే ఒక్కసారిగా గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఎవరూ లేపకపోతే రోజుల తరబడి పడుకుండిపోతారు. అందుకే దీనిని ‘స్లీపీ హలో’ అని పిలుస్తారు. సమీపంలోని పాత యురేనియం గనుల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఈ వ్యాధి వచ్చిందని భావిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 18, 2026
మరికొన్ని గంటల్లో విధ్వంసం.. ఇరాన్ హెచ్చరిక

మరికొన్ని గంటల్లో గల్ఫ్ దేశాల్లోని పెట్రోకెమికల్ ఫెసిలిటీస్‌పై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. సౌదీలోని జుబైల్, సమ్రెఫ్, ఖతర్‌లోని మిసాయిద్, రస్ లఫాన్ రిఫైనరీ, యూఏఈలోని అల్-హసన్ గ్యాస్ ఫెసిలిటీలపై అటాక్ చేస్తామని శాటిలైట్ ఫొటోలను రిలీజ్ చేసింది. ఈ 3 దేశాల్లోని ఆయా ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు, ప్రజలు అక్కడి నుంచి వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది.


