News November 18, 2025

హనుమకొండ: భవితశ్రీ చిట్‌ఫండ్ ఎండీ అరెస్ట్

image

భవితశ్రీ చిట్ ఫండ్ ఎండీ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ పరారీలో ఉండగా హనుమకొండ పోలీసులకు చిక్కాడు. కోట్లాది రూపాయలు చిట్టి సభ్యులకు ఎగవేసి, మోసం చేసి పరారీలో ఉన్న శ్రీనివాస్‌పై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 18, 2025

తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిపై దృష్టి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ థింక్స్ ఆక్వా పాండ్స్” కార్యక్రమానికి మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్వా రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించే దిశగా ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

News November 18, 2025

రేపటి నుంచి ఇందిరమ్మ చీరలు పంపిణీ: సీఎం రేవంత్

image

TG: ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రేపటి నుంచి మహిళలకు చీరల పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. HYD నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా విగ్రహం వద్ద మ.12 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. రేపటి నుంచి డిసెంబర్ 9వరకు గ్రామీణ ప్రాంతాల్లో, మార్చి 1 నుంచి 8 వరకు పట్టణాల్లో మొత్తంగా కోటి మందికి రెండు విడతల్లో చీరలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

News November 18, 2025

పత్తి రైతులను ఆదుకోవాలి: కేటీఆర్‌

image

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. భైంసా కాటన్ మార్కెట్‌ను సందర్శించి రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 8% తేమశాతం నిబంధనతో రైతులు నష్టపోతున్నారని, 20% తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 21న బోరాజ్‌ కదిలి రావాలని పిలుపునిచ్చారు.