News November 19, 2025

పెరవలి: కూతురిని గర్భిణిని చేసిన తండ్రి..డీఎస్పీ విచారణ

image

పెరవలి మండలంలో కన్న కూతురిపై తండ్రి రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడి గర్భిణిని చేసిన విషయం తెలిసిందే. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ జి.దేవకుమార్ గ్రామంలో విచారణ చేపట్టారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు. మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు.

Similar News

News March 27, 2026

MBNR: అంబేద్కర్ వర్సిటీ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదటి సంవత్సరం 2025 – 26 పరీక్షల షెడ్యూల్ విడుదల అయినట్లు మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా కె పద్మావతి పేర్కొన్నారు. పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు మేలో ఉంటాయని టైం టేబుల్ వెబ్ సైట్‌లో ఉందని తెలిపారు. పరీక్షకు సంబంధించిన ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 13వ తేదీ వరకు ఆకాశం ఉందని రీజినల్ కోఆర్డినేటర్ డా జి సత్యనారాయణ గౌడ్ వెల్లడించారు.

News March 27, 2026

తిరుపతి జిల్లాలో భారీ మార్పులు

image

తిరుపతి జిల్లాలో భారీ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. జనాభా ప్రాతిపదికన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో డివిజన్లు, వార్డులు పెరగనున్నాయి. వీటితో పాటు 25నుంచి 30వరకు పంచాయతీలు పెరిగేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు కూడా పెరిగారు. రిజర్వేషన్లపై క్లారిటీ వస్తే పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.

News March 27, 2026

GNT: కళల కాణాచి ముద్దుబిడ్డ గుత్తికొండ నరహరి

image

కళలకు పుట్టినిల్లు గుంటూరు జిల్లా.. కళల కాణాచి తెనాలి. ఈ గడ్డపై జన్మించిన గొప్ప మేధావి గుత్తికొండ నరహరి. ఆయన అమృతలూరు మండలం యలవర్రులో జన్మించారు. తెలుగు రాజకీయాల్లో అసమాన వక్తగా, రచయితగా, విశ్లేషకుడిగా చెరగని ముద్ర వేశారు. మూఢనమ్మకాలపై పోరాడి, ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం రేకెత్తించారు. గొప్ప నవ్య మానవవాదిగా పేరొందిన నరహరి వర్ధంతి నేడు (మార్చి 27). ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం.