News November 19, 2025
ఉత్తరాంధ్రలో అంచనాల కమిటీ పర్యటన

AP అంచనాల కమిటీ ఈనెల 25-29 వరకు ఉత్తరాంధ్రలో పర్యటించనుంది. ఛైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన కమిటీ సభ్యులు 25న విశాఖ చేరుకుంటారు. 26న సింహాచలంలో స్వామిని దర్శనం చేసుకొని.. దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమౌతారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో చర్చించనున్నారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన పనులకు సంబంధించిన అంశాలపై సమీక్షిస్తారు.
Similar News
News February 5, 2026
తిరుమల లడ్డూ కల్తీ నిజమే: ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయం వాస్తవమేనని MLA విష్ణు కుమార్ రాజు అన్నారు. గతంలో లడ్డూ తీసుకొస్తే 10 రోజుల పాటు సువాసన వచ్చేదని, ఐదేళ్లుగా లడ్డూను చూస్తేనే కల్తీ అయిందని అర్థమవుతోందన్నారు. YCP పాలనలో కొందరు నేతలు దారుణంగా మాట్లాడారని, అందుకే ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్పారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం పరిరక్షిస్తుందని
ఆయన స్పష్టం చేశారు.
News February 4, 2026
14వ తేదీ నుంచి వేటను నిలిపివేయండి: జేడీ లక్ష్మణరావు

విశాఖలో జరగనున్న ఐఎఫ్‌ఆర్, మిలాన్-2026 వేడుకల నేపథ్యంలో ఫిబ్రవరి 14 నుంచి 21వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. మూలపాలెంలో నిర్వహించిన సదస్సులో మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు మాట్లాడారు. భద్రతా కారణాల దృష్ట్యా నేవీ సూచనలు పాటించాలని, బోట్లు సంచరించకుండా సహకరించాలని ఆయన కోరారు. తీర ప్రాంతాల పరిశుభ్రతపై కూడా మత్స్యకారులకు అవగాహన కల్పించారు.
News February 4, 2026
IFR-2026 ఏర్పాట్లపై విశాఖ కలెక్టర్ సమీక్ష

విశాఖలో IFR-2026, మిలాన్ వేడుకలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమయ్యే ఈవెంట్లకు రాష్ట్రపతి, సీఎం వంటి ప్రముఖులతో పాటు లక్షలాది మంది ప్రజలు రానున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీసీ కెమరాలతో నిఘా, నో-డ్రోన్ జోన్ అమల్లో ఉంటాయని కమిషనర్ స్పష్టం చేశారు.


