News April 13, 2024

తొలిదశ ఎలక్షన్స్.. ధనిక అభ్యర్థి ఎవరంటే!

image

ఈ నెల 19న లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ జరగనుంది. ఈ ఫేజ్‌లో పోటీ చేసే అభ్యర్థుల్లో నకుల్‌నాథ్(INC) రూ.717 కోట్ల ఆస్తులతో ధనిక అభ్యర్థిగా నిలిచినట్లు ADR నివేదిక తెలిపింది. ఈయన మధ్యప్రదేశ్ Ex CM కమల్‌నాథ్ కుమారుడు. ఆ తర్వాత TNలోని AIADMK అభ్యర్థి అశోక్(రూ.662 కోట్లు), BJP నేత దేవనాథన్ (రూ.304 కోట్లు) నిలిచారు. పుదుచ్చేరిలో ఇండిపెండెంట్ అభ్యర్థి సతీశ్(25) రూ.2000 కలిగి ఉన్నట్లు ప్రకటించారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News March 19, 2026

కమిన్స్ దూరం.. SRHకు బౌలింగ్ కష్టాలు?

image

IPL2026లో కొన్ని మ్యాచులకు కమిన్స్ దూరం కానున్నట్లు SRH ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌లో స్ట్రాంగ్ ఉన్న ఆ టీమ్ బౌలింగ్‌లో వీక్‌గా కనిపిస్తోంది. కమిన్స్ లేకపోవడంతో మరింత బలహీనంగా మారింది. దీంతో పేస్ బాధ్యతలు ఉనద్కత్, హర్షల్, శివమ్ మావి మోయాల్సిన పరిస్థితి ఉంది. కానీ వారు రాణించేది అనుమానమే. అటు స్పిన్నర్లలో అనుభవజ్ఞులు లేరు. దీంతో ఈసారి కూడా జట్టు భారం మొత్తం బ్యాటర్లే మోయాల్సి రావొచ్చు.

News March 19, 2026

ఇకపై గల్ఫ్‌కు లోకల్ కరెన్సీల్లోనే చెల్లింపులు?

image

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇకపై గల్ఫ్ దేశాలతో వాణిజ్యం లోకల్ కరెన్సీలతో సెటిల్ చేసుకునే అంశాన్ని భారత్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అనిశ్చితి వల్ల పెరుగుతున్న దిగుమతి భారానికి చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తోంది. చెల్లింపులు మన రూపీ లేదా గల్ఫ్ దేశాల కరెన్సీలో చేయడం వల్ల డాలర్‌పై ఆధారపడటం తగ్గుతుందని, ఫలితంగా డాలర్‌ వల్ల కలిగే కన్వర్షన్ కాస్ట్ భారం కూడా ఉండదని అధికారులు చెబుతున్నారు.

News March 18, 2026

‘ధురంధర్-2’ పబ్లిక్ టాక్

image

‘ధురంధర్-2’ ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు Xలో రివ్యూలు ఇస్తున్నారు. ఫిల్మ్ మేకింగ్ అదిరిపోయిందని, రణ్‌వీర్ సింగ్ నటన, ఇంటర్వెల్ అద్భుతం అని ప్రశంసిస్తున్నారు. డైరెక్టర్ ఆదిత్య ధార్ 4 గంటల సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించారని చెబుతున్నారు. హింసాత్మక సీన్లు ఎక్కువగా ఉన్నా దేశభక్తి సినిమా కాబట్టి జస్టిఫై చేసేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
*Way2News ఫుల్ రివ్యూ రేపు ఉదయం..