News November 19, 2025

MBNR: వాలీబాల్ ఎంపికలు.. విజేతలు వీరే!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో బాల, బాలికలకు వాలీబాల్ ఎంపికలు నిర్వహించారు. మొత్తం 500 మంది క్రీడాకారులు పాల్గొనగా..
✒బాలికల విభాగంలో
1.బాలానగర్
2.మహమ్మదాబాద్
✒బాలుర విభాగంలో
1.నవాబ్ పేట
2. మహబూబ్ నగర్ జట్లు గెలిచినట్టు ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. ఎంపికైన వారికి ఉమ్మడి జిల్లా సెలక్షన్‌కు పంపిస్తామన్నారు.

Similar News

News April 1, 2026

‘పోలవరం’ అకౌంట్లోకి డబ్బులు

image

AP: పోలవరం ప్రాజెక్టుకు రూ.1,301.61కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ కుల్దీప్ కుమార్‌ సింగ్ రాష్ట్రానికి లేఖ రాశారు. ఆ డబ్బులు ప్రాజెక్ట్ అకౌంట్లో నేరుగా జమవుతాయని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. డ్యామ్ పనులు, నిర్వాసితుల పరిహారం కోసం రూ.1,508కోట్లు మంజూరు చేయాలని ఇటీవల రాష్ట్ర జలవనరులశాఖ కేంద్రాన్ని కోరింది. సమీక్షించి తాజాగా నిధులు రిలీజ్ చేసింది.

News April 1, 2026

KU డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

కేయూ పరిధిలోని డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలను మంగళవారం అధికారులు విడుదల చేశారు. 2025 నవంబరులో నిర్వహించిన 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి పునః మూల్యాంకనం కోరిన విద్యార్థుల ఫలితాలు వెలువడ్డాయని వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ https://www.kuonline.co.in/ ద్వారా చూసుకోవచ్చని సూచించారు.

News April 1, 2026

NLG: ప్రజాపాలన అప్లికేషన్స్ మాయం.. కలెక్టర్‌కు ఫిర్యాదు

image

కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన మహిళ పథకాల కోసం దరఖాస్తు చేసుకోగా, ఆన్‌లైన్ రశీదు ఉన్నా కార్యాలయంలో ఫైల్ కనిపించడం లేదు. దీనిపై బాధితురాలు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. రికార్డుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.