News November 18, 2025
పోక్సో కేసులో నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష: ASF SP

మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన, అత్యాచారయత్నం కేసులో కోర్టు నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.12,000 జరిమానా విధించినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. 2020లో బెజ్జూర్‌లో జరిగిన ఈ ఘటనపై నమోదు చేసిన కేసును ప్రత్యేక కోర్టు పరిశీలించి నిందితులకు శిక్ష విధించిందన్నారు.
Similar News
News November 18, 2025
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిపై దృష్టి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ థింక్స్ ఆక్వా పాండ్స్” కార్యక్రమానికి మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్వా రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించే దిశగా ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
News November 18, 2025
రేపటి నుంచి ఇందిరమ్మ చీరలు పంపిణీ: సీఎం రేవంత్

TG: ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రేపటి నుంచి మహిళలకు చీరల పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. HYD నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా విగ్రహం వద్ద మ.12 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. రేపటి నుంచి డిసెంబర్ 9వరకు గ్రామీణ ప్రాంతాల్లో, మార్చి 1 నుంచి 8 వరకు పట్టణాల్లో మొత్తంగా కోటి మందికి రెండు విడతల్లో చీరలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
News November 18, 2025
పత్తి రైతులను ఆదుకోవాలి: కేటీఆర్

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భైంసా కాటన్ మార్కెట్‌ను సందర్శించి రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 8% తేమశాతం నిబంధనతో రైతులు నష్టపోతున్నారని, 20% తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 21న బోరాజ్ కదిలి రావాలని పిలుపునిచ్చారు.


