News November 19, 2025
PDPL: డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే చెప్పండి: కలెక్టర్

PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాల నిరోధంపై ఆయన నిన్న ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ యువత జీవితాలను నాశనం చేస్తాయని, దీనిపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 20, 2026
కేంద్రీయ గిరిజన యూనివర్సిటీకి సహకారం: భట్టి

ములుగు జిల్లాలో నిర్మిస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో ఈ మేరకు ఆయన వెల్లడించారు. ఆదివాసీ గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గిరిజన్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్‌ను మరింత విస్తరిస్తామని తెలిపారు.
News March 20, 2026
రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్షసూచన

AP: పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. మరికాసేపట్లో కృష్ణా జిల్లాలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇప్పటికే ఆ జిల్లాలో కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. మరో 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.
News March 20, 2026
వెయిట్ లాస్ మందుల ధర తగ్గించిన నాట్కో

అధిక బరువుతో బాధపడేవారికి NATCO గుడ్ న్యూస్ చెప్పింది. నోవో నార్డిస్క్ పేటెంట్ గడువు ముగియడంతో సెమాగ్లుటైడ్ జెనరిక్ వెర్షన్‌ను అత్యంత చౌకగా మార్కెట్లోకి తెచ్చింది. SEMANATTM, SEMAFULLTM బ్రాండ్ల పేరుతో లభించే మల్టీ-డోస్ వయల్స్ ధరను కేవలం ₹1,290గా నిర్ణయించింది. ఇది అసలు బ్రాండ్ ధర కంటే దాదాపు 90% తక్కువ కావడం విశేషం. ఏప్రిల్‌లో పెన్ డివైజ్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి.


